Mahindra TUV300- Toyota Fortuner: స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ భాగంలో ఫార్చునర్ ను మించిన వెహికల్ లేదు. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలేమో.. ఒకవేళ ఫార్చునర్ గురించి ఆలోచన వస్తే దానిని మహీంద్రా కంపెనీ మీదికి లగ్నం చేసుకోవాలేమో.. ఎందుకంటే ఫార్చునర్ కారు ను ఒక మహీంద్రా కార్ ఢీ కొంటే గాలిలో చక్కర్లు కొట్టి కిందకు పడిపోయింది. వాస్తవానికి ఫార్చునర్ చాలా బలమైన వెహికల్ అని టయోటా ప్రచారం చెబుతుంది. కానీ వాస్తవ పరిస్థితి వేరని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
ఇంతకీ ఏం జరిగిందంటే
సైబరాబాద్ పోలీసులు తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. దాని ప్రకారం రోడ్డు మీద నుంచి వస్తున్న టయోటా ఫార్చునర్ ను రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన మహీంద్రా వెహికల్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఫార్చునర్ గాల్లో చక్కర్లు కొట్టి కింద పడిపోయింది. అయితే అదృష్టవశత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మహీంద్రా వెహికిల్ నడిపే డ్రైవర్ మలుపు తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతివేగం వల్ల వాహనాన్ని నియంత్రించలేకపోయాడు. అండర్ స్టీరింగ్ అడ్డుపడటంతో అమాంతం అది ఫార్చునర్ ను ఢీకొట్టింది.
జాగ్రత్తగా నడపాలి
అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు కొన్ని సూచనలు చేశారు. మామూలు వాహనాలతో పోలిస్తే స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ టిప్పింగ్ వల్ల ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. అధిక వేగంతో ఉన్నప్పుడు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ని అదుపు చేసేందుకు ప్రయత్నించకూడదు. అలాంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ఎలివేటెడ్ గ్రౌండ్ క్లియరెన్స్ అంత తొందరగా నియంత్రించేందుకు సహకరించదు. ముఖ్యంగా ఇలాంటి వాహనాలను నడిపే డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ పొడవైన నిర్మాణాలు కలిగి ఉంటాయి. రోల్ ఓవర్లకు ఎక్కువ అవకాశం కల్పిస్తాయి. వీటి పైకప్పు చాలా ఎత్తుగా ఉండటం వల్ల గురుత్వాకర్షణను పెంచుతుంది. సెడాన్ వంటి రకం తో పోల్చినప్పుడు ఎస్ యూ వీ లు తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటప్పుడు వాటి వేగాన్ని నియంత్రించడం సాధ్యపడదు. అయితే ఖరీదైన సస్పెన్షన్ సెటప్ కారణంగా ఎస్ యు విలు అంత త్వరగా ధ్వంసం కాదు. కానీ మూల మలుపుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే అంతే సంగతులు.
హరికృష్ణ విషయంలో..
జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా ఎస్ యూ వీ ప్రమాదంలో మరణించాడు. అతడు డ్రైవింగ్ చేస్తున్న వాహనం వేగం నియంత్రణలోకి రాకపోవడంతో అది తిరగబడింది. ఎయిర్ బ్యాగ్స్ సకాలంలో తెరుచుకున్నప్పటికీ ప్రాణ నష్టం సంభవించింది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ కు గ్రౌండ్ క్లియరెన్స్, టిల్టింగ్, పొటెన్షియల్ ఫాల్స్ ఎక్కువ కాబట్టి డ్రైవర్లు చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఫార్చునర్ కారును మహేంద్ర కారు ఢీ కొట్టిన నేపథ్యంలో రికార్డ్ అయిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.” ఆనంద్ మహీంద్రా భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త. టయోటా జపాన్ కంపెనీకి చెందింది. అయినప్పటికీ భారత్ జపాన్ దేశాన్ని నడిరోడ్డు మీద కొట్టేసింది” అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Reckless driving at high speed trying to take a turn results in a crash.
A non fatal accident at Gowlidoddi, Gachibowli.
Youtube link: https://t.co/8V6zV3mDhn#RoadSafetyCyberabad #RoadSafety pic.twitter.com/nvhodKFxiY
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) May 23, 2021