
Nandamuri Kalyan Ram: నందమూరి నటవారసుల్లో కళ్యాణ్ రామ్ ఒకరు. హరికృష్ణ పెద్ద కుమారుడైన కళ్యాణ్ రామ్ హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.బాలగోపాలుడు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కళ్యాణ్ రామ్ కెరీర్ మొదలైంది. 2003లో తొలిచూపులోనే చిత్రంతో కళ్యాణ్ రామ్ హీరో అయ్యారు. ఆయనకు బ్రేక్ వచ్చింది మాత్రం అతనొక్కడే చిత్రంతో. దర్శకుడు సురేందర్ రెడ్డి రివేంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన అతనొక్కడే సూపర్ హిట్ కొట్టింది. అయితే ఆ జోరు కొనసాగించడంలో కళ్యాణ్ రామ్ ఫెయిల్ అయ్యారు. వరుస పెట్టి సినిమాలు చేసినా దక్కిన విజయాలు చాలా తక్కువ. పరాజయాలు ఎదురవుతున్నా, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
గత ఏడాది ఆయనకు మెమరబుల్ హిట్ పడింది. కొత్త దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన బింబిసార భారీ విజయం సాధించింది. సోసియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన బింబిసార పరిశ్రమ కష్ట సమయంలో ఉండగా అవసరమైన విజయం అందించింది. ఇకపైన సబ్జెక్ట్స్ ఎంపిక విషయంలో జాగ్రత్త వహించి విజయాల శాతం పెంచాలి అనుకుంటున్నాడు. ఈ క్రమంలో అమిగోస్ అంటూ కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు.
టైటిల్ తోనే ప్రేక్షకులను ఆకర్షించాడు కళ్యాణ్ రామ్. స్పానిష్ భాషకు చెందిన పదం అమిగోస్ అంటే ఫ్రెండ్ అని అర్థం. ఈ చిత్రంలో కళ్యాణ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. అమిగోస్ ప్రీరిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. దీంతో మూవీకి భారీ ప్రచారం దక్కింది. బింబిసార తర్వాత వస్తున్న మూవీ కావడంతో ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. అమిగోస్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

కాగా కళ్యాణ్ రామ్ చేతిపై ఉన్న స్వాతి అనే టాటూ అందరినీ ఆకర్షించింది. ఆ టాటూతో పాటు భార్య స్వాతి గురించి మొదటిసారి కళ్యాణ్ రామ్ మాట్లాడారు. స్వాతి గొప్ప భార్య అని పొగడ్తలతో ముంచెత్తారు. 2007లో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. అప్పుడు నన్ను కంటికి రెప్పలా కాపాడింది. ఎవరో పనిమనిషి పెట్టకుండా తన పనులన్నీ తానే చూసుకుంది. సపర్యలు చేసింది. తల్లికి మించి సేవలు చేసింది. నాకు ఇంజక్షన్ అంటే భయం. ఆమె పేరు పచ్చబొట్టు వేయించుకోవడం ద్వారా ఆ భయాన్ని అధిగమించానని చెప్పుకొచ్చారు. 2006లో కళ్యాణ్ రామ్-స్వాతిల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు.