
Sameera Reddy: బొద్దుగా కనిపిస్తున్న ఈ ఫొటోలోని చిన్నారి పాన్ ఇండియా లెవెల్ లో అందరి స్టార్ హీరోలతో కలిసి నటించి యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించింది..టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలు ఒక్కటి కూడా విజయం సాధించలేదు.కానీ యూత్ లో ఇప్పటికీ ఈమెకి మంచి క్రేజ్ ఉంది.ఆమె మరెవరో కాదు..సమీరా రెడ్డి.జూనియర్ ఎన్టీఆర్ తో ఈమె నరసింహుడు మరియు అశోక్ వంటి సినిమాలు చేసింది, మెగాస్టార్ చిరంజీవి తో జై చిరంజీవ వంటి చిత్రం చేసింది.
వీటిల్లో ‘జై చిరంజీవ’ సినిమా ఒక్కటే పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..అవి ఫ్లకాప్ అయ్యినప్పటికీ కూడా సమీరా రెడ్డి కి యూత్ లో మంచి క్రేజ్ ఉండడానికి కారణం ఆమె అందమే.కేవలం తెలుగు లోనే కాదు హిందీ మరియు తమిళం లో కూడా బోలెడన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.
కానీ ఆమెకి హిందీ లో వచ్చినన్ని విజయాలు మరో ఇండస్ట్రీ లో రాలేదనే చెప్పాలి..కానీ తమిళం లో సూర్య నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కాకపోయినప్పటికీ కూడా ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిలిచింది.సమీరా రెడ్డి చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం పేరు ‘వరదనాయక’..తెలుగు లో సూపర్ హిట్టైన గోపీచంద్ లక్ష్యం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం లో సుదీప్ మరియు చిరంజీవి సర్జా హీరోలుగా నటించగా సమీరా రెడ్డి , నిఖీషా పటేల్ హీరోయిన్స్ గా నటించారు.

ఈ సినిమా తర్వాత ఆమె 2014 వ సంవత్సరం లో అక్షయ్ అనే అతనిని పెళ్ళాడి సినిమాలకు టాటా చెప్పేసింది..ఈమెకి ఒక కొడుకు మరియు కూతురు కూడా ఉన్నారు, సినిమాలకు దూరం అయ్యినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులతో ఎప్పుడూ ఇంట్ర్యాక్ట్ అవుతూనే ఉంటుంది..అంతే కాదు తన వ్యక్తిగత ఫోటోలను కూడా ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది సమీరా రెడ్డి.