KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్ కు(KA Pal) షాక్ ఇచ్చారు విమానాశ్రయ అధికారులు. పాకిస్తాన్ తో ఇండియా యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన సంగతి తెలిసిందే. వీటిని చక్కదిద్ది శాంతి చర్చల కోసం పాకిస్తాన్ వెళతానని కేఏ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ శాంతి చర్చిల కోసం అంటూ ఆయన విమాన టికెట్లు సైతం బుక్ చేసుకున్నారు. ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడ పెద్ద హంగామానే చేశారు. కానీ ఎయిర్పోర్ట్ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కొద్దిపాటి విభాగం అక్కడ నడిచింది.
Also Read: ఏపీ ప్రజలకు ‘జూన్’ ఉపశమనం.. ఆపద సమయాన్ని గట్టెక్కిస్తున్న ప్రభుత్వం!
* ఎయిర్ లైన్స్ సిబ్బందితో వాగ్వాదం..
టర్కీకి ( Turkey) శాంతి శిఖర సభలో పాల్గొనడానికి వెళుతున్నాను అంటూ కేఏ పాల్ ఆదివారం ముంబై ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ సదరు ఎయిర్లైన్స్ సిబ్బంది వారిని ప్రయాణానికి అనుమతించకుండా అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ వారితో వాగ్వాదానికి దిగారు. వారి తీరుపై తీవ్రవా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దగ్గర పాస్పోర్ట్, వీసా, విమాన టిక్కెట్లు ఉన్నాయని.. తన కుమారుడు జాన్ పాల్, జ్యోతి, మమతా రెడ్డి తో కలిసి టర్కీలోని ఇస్తాంబుల్ వెళుతున్నట్లు చెప్పారు కేఏ పాల్. గతవారం కూడా తాను టర్కీలో ఉన్నానని.. అటువంటి అప్పుడు తనను ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. తనను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రయాణాన్ని అక్రమంగా, చట్ట విరుద్ధంగా అడ్డుకున్నారంటూ కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏకంగా ముంబై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు కూడా. ఎయిర్లైన్స్ సీఈవో తో పాటు తమను అడ్డుకున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ కోరారు.
* సంచలన కామెంట్స్..
అయితే ఈ సందర్భంగా కేఏ పాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 37 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు పాల్. పాకిస్తాన్ పై ఉద్రిక్తతలపై డోనాల్డ్ ట్రంప్( Donald Trump), అమెరికా సెనేటర్లతో కూడా ఫోన్లో మాట్లాడానని చెప్పుకొచ్చారు. టర్కీ వెళ్తుంటే అడ్డుకోవడం తగదని ఆరోపించారు. ప్రస్తుతం కేఏ పాల్ ను ఎయిర్లైన్స్ సిబ్బంది అడ్డుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పాల్. తనను ముంబై ఎయిర్పోర్టులో అడ్డుకున్నారని.. దీనిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
