
Rajamouli- Prabhas: ప్రభాస్ బాగా మొహమాటస్తుడు. ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉండేది కూడా అందుకే. మీడియా ముందుకు రావడానికి, ఇంటరాక్ట్ కావడానికి ఇబ్బందిపడుతుంటారు. చాలా రిజర్వ్డ్ గా ఉంటే ప్రభాస్ ఇంట్రావర్ట్. ఈ క్రమంలో జనాలతో కూడిన షాట్స్ చేయడానికి ఒకింత బెరుకుగా ఫీల్ అయ్యేవాడట. పబ్లిక్ లో నటించడానికి సిగ్గు పడతాడట. చక్రం మూవీలో ప్రభాస్ ఓ సన్నివేశంలో థర్డ్ జెండర్ లా నటించాలి. అది కూడా వీధిలో. ఈ సన్నివేశంలో నటించడానికి ప్రభాస్ చాలా ఇబ్బందిపడ్డాడట. వీలైతే కృష్ణవంశీని సీన్ మార్చేయమని కూడా అడిగారట. ఆయన తప్పదు అనడంతో… ఊపిరి బిగపట్టుకుని ఎలా గొలా షాట్ ఒకే చేశాడట.
ఇదే అనుభవం రాజమౌళితో కూడా అయ్యిందట. ఛత్రపతి మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో విలన్ ని చంపిన ప్రభాస్ కోటా శ్రీనివాసరావుకి వార్నింగ్ ఇస్తాడు. అనంతరం బయట గుంపుగా నిల్చొని ఉన్న జనాలను ఉద్దేశిస్తూ ఆవేశంగా ఓ డైలాగ్ చెప్పాలి. రాత్రివేళ వర్షం ఎఫెక్ట్, చలిలో ఆ డైలాగ్ చెప్పడానికి ప్రభాస్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడట. దాంతో రాజమౌళిని ప్రభాస్ రిక్వెస్ట్ చేశాడట. నేను చిన్నగా డైలాగ్ చెబుతాను. బిగ్గరగా చెప్పలేనని అన్నారట.

రాజమౌళి ప్రభాస్ అభ్యర్థన మన్నించి డైలాగ్ చిన్నగా చెప్పించాడట. ప్రభాస్ డైలాగ్ చెబుతుంటే జూనియర్ ఆర్టిస్స్ అందరూ రిహార్సల్ అనుకున్నారట. రాజమౌళి మాత్రం షాట్ ఓకే చేశారట. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ షూటింగ్ లో కూడా ప్రభాస్ కి ఇదే పరిస్థితి ఎదురైందట. పెద్దగా డైలాగ్ చెప్పడానికి ఇబ్బంది పడ్డాడట. ఆ సీన్లో నటిస్తున్న లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్… ప్రభాస్ మీద ఒకింత అసహనం వ్యక్తం చేశారట. ‘ఇలాగైతే ఎలాగయ్యా.. డైలాగ్ ఓపెన్ గా చెప్పాలి. సిగ్గుపడితే ఎలా?’ అన్నారట.
ఈ క్రమంలో ప్రభాస్ ఇలా తయారు కావడానికి రాజమౌళే కారణమని కొందరు దర్శకులు తిట్టుకునేవారట. ఆ రోజు ఛత్రపతి మూవీ షూటింగ్ లో ప్రభాస్ రిక్వెస్ట్ రాజమౌళి ఓకే చేసి ఇలా తయారు చేశాడు. ప్రభాస్ డైలాగ్ పెద్దగా చెప్పానంటూ ఇబ్బంది పెడుతున్నాడని వాపోయేవారట. ఈ విషయాన్ని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు. అయితే మెల్లగా రాజమౌళి ఆ సమస్యను అధిగమించాడు. గ్రేట్ యాక్టర్ గా ఎదిగారు.