NTR- Sampoornesh Babu: కామెడీ హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఒకడు సంపూర్ణేష్ బాబు..’హృదయ కాలేయం’ అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఇతను అడల్ట్ కామెడీ మూవీస్ తో తొలి సినిమా నుండే ప్రేక్షకుల అటెన్షన్ ని గ్రాబ్ చేసాడు..ఇక ఆ తర్వాత పలు సినిమాలలో హీరో గా నటించి అల్లరి నరేష్ తరహాలో ప్యారడీల ద్వారా కామెడీ రప్పించగలిగే హీరో గా నిలిచాడు.

అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొద్దిరోజులకే మంచి పాపులారిటీ ని దక్కించుకున్న ఈయనకి బిగ్ బాస్ సీజన్ 1 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది..హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేసాడు..’సన్న పిన్ చార్జర్’ ఉందా అంటూ సంపూ చేసిన కామెడీని ఇప్పటికీ నెటిజెన్స్ ఎదో ఒక సందర్భం లో వాడుతూనే ఉన్నారు..అలా తన మార్కు తో ముందుకు దూసుకుపోతున్న సంపూర్ణేష్ బాబు కి అకస్మాత్తుగా హోమ్ సిక్ వచ్చింది.
చిన్నప్పటి నుండి పల్లెటూరి వాతావరణం లో పెరిగిన సంపూర్ణేష్ బాబు కి బిగ్ బాస్ హౌస్ ఒక జైలులాగా అనిపించింది..కన్ఫెషన్ రూమ్ లోపలకి వెళ్లి నేను బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతాను అంటూ ఏడ్చి మధ్యలోనే హౌస్ నుండి బయటకి వచ్చేస్తాడు..అప్పట్లో అది ఒక సెన్సేషన్ అయ్యింది..బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా గంగవ్వ అలాగే బయటకి వచ్చేస్తుంది..అయితే అగ్రిమెంట్ ప్రకారం ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయితే తప్ప సొంతంగా బయటకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం పాతిక లక్షల రూపాయిల ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

సంపూర్ణేష్ బాబు అప్పుడే ఇండస్ట్రీ కి వచ్చిన వ్యక్తి..అంత డబ్బులు కట్టలేని పరిస్థితి..అలాంటి సమయం లో ఆ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సంపూర్ణేష్ బాబు కోసం కల్పించుకొని..బిగ్ బాస్ యాజమాన్యం తో మాట్లాడి , తన సొంత ఖర్చులతో వాళ్లకి పాతిక లక్షల రూపాయిలు చెల్లించి సంపూర్ణేష్ బాబు కి అండగా నిలబడ్డాడు అట..ఈ విషయాన్ని ఆ షో లో ఒక కంటెస్టెంట్ గా ఉన్న సమీర్ తెలిపాడు.