
#NTR30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈమధ్యనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆద్వర్యం లో ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించారు.మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగానే, ఈ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది.
అదేమిటి అంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ చేయబోతున్నాడట.ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి పాత్ర ని కూడా ఎన్టీఆర్ చేయబోతున్నాడట.గతం లో ఆయన అదుర్స్ ,ఆంధ్రవాలా మరియు శక్తి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసాడు.అదుర్స్ సినిమా సూపర్ హిట్ అవ్వగా, ఆంధ్రవాలా మరియు శక్తి చిత్రాలు ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఈ భయమే పట్టుకుంది.
ఆయన కెరీర్ లో ద్విపాత్రాభినయాలు చేసిన సినిమాలు విజయాలు సాధించినవి చాలా తక్కువే ఉండడం, దానికి తోడు కొరటాల శివ ప్రస్తుతం డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉండడం వల్ల ఆయన ఈ చిత్రాన్ని ఎలా డీల్ చేస్తాడో అని భయపడిపోతున్నారు ఫ్యాన్స్.మరోపక్క కొరటాల శివ ఈ స్క్రిప్ట్ ని కసి తో రాసాడని, గ్రాండియర్ విషయం లో ఎక్కడా కూడా రాజీ పడకుండా, సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు నోరెళ్ళబెట్టి చూసే విధంగా స్క్రిప్ట్ సిద్ధం చేసాడని, అభిమానులు గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశాంతం గా ఈ సినిమా కోసం ఎదురు చూడాల్సిందిగా #NTR30 కి చెందిన టీం సభ్యులు సమాచారం అందించారు.
ఈ చిత్రం లో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుండగా,విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్టు సమాచారం.ఈ ఏడాదిలోనే షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 9 వ తారీఖున ఈ సినిమాని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.