
Junior NTR On War 2: #RRR చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ కి ఎగబాకిన విషయం అందరికీ తెలిసిందే. ఆస్కార్ అవార్డ్స్ విషయం లో ఎన్టీఆర్ ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యాడు, అప్పటి నుండి ఆయన ఏమి చేసిన సెన్సేషన్ అయిపోతుంది. #RRR తర్వాత ఆయన చెయ్యాల్సిన కొరటాల శివ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభం అయ్యింది.
ఫ్యాన్స్ ఆ ఊపు ని ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే నేడు ‘వార్ 2 ‘ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ తో తలపడనున్నాడు అనే వార్త సోషల్ మీడియా ని షేక్ చేసింది. 2019 వ సంవత్సరం హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో వచ్చిన ‘వార్’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా అప్పట్లోనే 350 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.
అలాంటి సెన్సషనల్ ప్రాజెక్ట్ కి సీక్వెల్ అంటే హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రాజెక్ట్ లో భాగం అయ్యినందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పట్టరాని ఆనందం లో ఉన్నారు,మరోపక్క ఎన్టీఆర్ పాత్ర ఎక్కడ తగ్గుతుందో అని భయం లో కూడా ఉన్నారు. ఎందుకంటే ‘వార్’ ఫ్రాంచైజ్ లో మెయిన్ హీరో హ్రితిక్ రోషన్, ఈ విషయం ఎప్పుడో ఖరారు అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ తో తలపడనున్నాడు అని అంటున్నారంటే కచ్చితంగా నెగటివ్ రోల్ అయ్యుంటుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

ఎన్టీఆర్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద మాస్ హీరో, అలాంటి స్టార్ క్యారక్టర్ తగ్గిస్తే అభిమానులు అసలు సహించరు. కాబట్టి డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అలాంటి సాహసాలు చెయ్యలేదులే అని ఆనుతున్నారు కొంతమంది. అంత ప్రాజెక్ట్ కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగటివ్ రోల్ అయినా సర్దుకుపోతారని మరికొంతమంది అంటున్నారు. చూడాలి మరి వీటిల్లో ఏది నిజం అవ్వుద్దో.