
Pawan Kalyan OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న చిత్రం ‘#OG’.ఈ సినిమా ప్రారంభం కోసం అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూసారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ రీసెంట్ గానే ఈ చిత్రం ముంబై లో షూటింగ్ ని ప్రారంభించుకుంది.తొలుత పవన్ కళ్యాణ్ లేని కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.
షూటింగ్ ప్రారంభం అవ్వగానే మూవీ టీం విడుదల చేసిన ఒక మేకింగ్ వీడియో కి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈ స్క్రిప్ట్ మేకింగ్ వీడియో యూట్యూబ్ లో టాప్ 1 స్థానం లోనే ట్రెండ్ అవుతుంది. హీరో షాట్స్ లేకుండా, కేవలం డైరెక్టర్ వీడియో కి ఇంతటి రెస్పాన్స్ అంటే సాధారణమైన విషయం కాదు. ఇది ఇలా ఉండగా ఈరోజు ఈ సినిమాకి సంబంధించి మరో సెన్సేషనల్ అప్డేట్ ఇవ్వబోతుంది మూవీ టీం.

పవన్ కళ్యాణ్ నేడే #OG మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టాడట, ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలియచేసింది డీవీవీ దానయ్య టీం. ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది లోనే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి,డిసెంబర్ నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు టీం.ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది.
రాబొయ్యే రోజుల్లో ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇక నేడు పవన్ కళ్యాణ్ సెట్స్ లో జాయిన్ అయిన సందర్భంగా మరో స్పెషల్ వీడియో ని నేడు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇక నుండి #OG కి సంబంధించి రోజూ ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందని, ఫ్యాన్స్ కి ప్రతీ రోజు పండగే అని అంటున్నారు.