Homeట్రెండింగ్ న్యూస్Japan Man Turn Into Dog: కుక్కగా మారిన జపాన్ వ్యక్తి.. ఏకంగా రూ. 12...

Japan Man Turn Into Dog: కుక్కగా మారిన జపాన్ వ్యక్తి.. ఏకంగా రూ. 12 లక్షల ఖర్చు

Japan Man Turn Into Dog: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందట. మనిషికో రకంగా ఆలోచన ఉంటుంది. కొందరు ఆడవారు మగవారిగాను మగవారు ఆడవారిలాగా మార్చుకున్న సంఘటనలు ఉన్నాయి. కానీ మనిషి ఓ జంతువులా మారాలనుకోవడం మాత్రం ఇదే ప్రథమం. తనకు కలిగిన కోరికను నిజం చేసుకోవడానికి అతడు ఏకంగా రూ. లక్షలు ఖర్చు చేసి మరీ తన కోరిక నెరవేర్చుకున్నాడు. మనిషి జంతువులా మారితే ఎలా ఉంటుంది అనే ఉత్సాహంతో ఓ శునకంలా మారి అందరిని ఆశ్చర్యపరిచాడు. తనలో కలిగిన కోరికకు ఆచరణ రూపం సాధించడానికి ఎంతో శ్రమించాడు. చివరకు విజయం సాధించాడు.

Japan Man Turn Into Dog
Japan Man Turn Into Dog

జపాన్ లోని టోకో ఈవీ అనే వ్యక్తి తనకొచ్చిన ఆలోచనతో కోలీ జాతి కుక్కలా మారాలని అనుకున్నాడు. దీనికి గాను జెప్పెట్ అనే సంస్థకు ఆఫర్ ఇచ్చాడు. వారు రూ. 12 లక్షలు ఖర్చవుతాయని చెప్పగా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశాడు. దీంతో వారు అతడిని 40 రోజులు శ్రమించి ఓ కోలీ జాతి కుక్కలా మార్చారు. అచ్చం బొచ్చుకుక్కలాగా మార్చి అతడి కోరికను నెరవేర్చారు. దీంతో అతడు తన కోరిక నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

Also Read: IPL 2022 Eliminator: ఐపీఎల్: ఆర్సీబీ సెమీస్ కు.. లక్నో కొంప ముంచింది ఏంటి?

దీంతో టోకో ఈవీ తన కోరిక నెరవేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. యూట్యూబ్, ట్విటర్, ఫేస్ బుక్ అన్ని సోషల్ మీడియాల్లో పోస్టు చేశాడు. అయితే కుక్క అవతారంలో అతడు ఎంత కాలం ఉంటాడో మాత్రం తెలియడం లేదు. మనిషిలో వస్తున్న వెర్రికి నిదర్శనమే ఈ పని. ఏదో సాధించాలనే తపనలో మనిషి తన ఉనికినే కోల్పోతున్నాడు. కుక్క అవతారం ఎత్తడంతో అందరు వింతగా చూస్తున్నారు.

మొత్తానికి అతడి కోరిక తీరడంతో శునకంలా మారిన టోకో ఈవీ ఆలోచన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఎందుకు కక్కలా మరాడు? అతడి ఉద్దేశం ఏమిటి? ఎందుకీ అవతారం ఎత్తినట్లు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనిషి ఆలోచనలు అవధులు దాటుతున్నాయి. వింత చేష్టలతో జీవన గమనాన్ని మార్చుకుంటున్నాడు. పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అని అందుకే అన్నట్లుగా తెలుస్తోంది. టోకో ఈవీ శునకంలా మారి ఏం చేస్తాడో ఎవరికి అంతుచిక్కడం లేదు. కానీ శునకం అవతారం ఎత్తి మానవ జాతికి ఏం సందేశం ఇవ్వనున్నాడో అర్థం కావడం లేదు.

Japan Man Turn Into Dog
Japan Man Turn Into Dog

అతడు కుక్కలా మారడానికి కనీసం నలభై రోజులు పట్టాయి. మన కరెన్సీలో రూ. 12 లక్షలు ఖర్చయ్యాయి. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసి సాధించేందేమిటి? అతడి వెర్రికి ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావడం గమనార్హం. ఇంతకీ ఏదైనా సందేశం ఇచ్చారా అంటే అదీ లేదు. పుర్రెలో పుట్టిన గుణానికి రూ. 12 లక్షలు మాత్రం వదిలించుకున్నాడు.

Also Read:Modi vs Kcr: మోడీ ముఖాన్ని కేసీఆర్ ఎందుకు చూడలేకపోతున్నారు? పారిపోతున్నారు?

Recommended Videos:

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular