
Janaki Kalaganaledu Serial: మాటీవీ లో ప్రసారమయ్యే సీరియల్స్ మరియు ఎంటర్టైన్మెంట్ షోస్ కి మంచి క్రేజ్ ఉంటుంది. టీఆర్ఫీ రేటింగ్స్ కూడా అదిరిపోతుంతాయి. అలా అద్భుతమైన TRP రేటింగ్స్ తో ముందుకు దూసుకుపొయ్యే సీరియల్స్ లో ఒకటి ‘జానకి కలగనలేదు’.ఈ సీరియల్ ని వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చూస్తుంటారు. ప్రస్తుతం వారానికి 7.90 టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకెళ్తుంది ఈ సీరియల్. IPS కావాలని కలలుగనే జానకి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడం వల్ల కానిస్టేబుల్ గా స్థిరపడుతోంది.
ఇక ఇంతే నా జీవితం అని డీలా పడిపోయిన జానకి లో ఉత్సహాన్ని నింపి ఆమెని IPS వైపు అడుగులు వేసేలా ఆమెని తన ఉత్తేజభరితమైన మాటలతో చైతన్యం కలిగిస్తాడు భర్త రామ చంద్ర. ఇక ఆ తర్వాత భర్త సపోర్టు తో IPS చదవడానికి నిద్రాహారాలు కూడా మాని కష్టపడుతుంది జానకి. అయితే రామ చంద్ర – జానకి దంపతులను పెళ్ళైనా కూడా ఇన్నేళ్లు పిల్లలు లేరని సమాజం లో ఉన్నవాళ్లు ఎగతాళి చేస్తూ ఉంటారు.

ఇదంతా గమనించిన జ్ఞానాంబ (రామచంద్ర తల్లి) ఎంతో మానసిక వేదనకు గురి అవుతుంది. ఒక రోజు జానకి ని పిలిచి ‘తల్లి కావాలనుకోవడం ఒక అదృష్టం..ప్రతీ ఆడబిడ్డ తల్లి అయ్యే క్షణం కోసం తపన పడుతుంది. నువ్వు నీ లక్ష్యం కోసం తల్లి అవ్వకూడదు అని అనుకుంటున్నావు. భవిష్యత్తులో వయస్సు అయిపోయాక నీకు తల్లి అయ్యే భాగ్యం కలగకపోతే నువ్వే బాధపడుతావు’ అని జానకి కి జ్ఞాన బోధ చేస్తుంది జ్ఞానాంబ. ఆమె మాటలకు జానకి ఆలోచనల్లో పడడం ప్రారంభిస్తుంది. అత్తయ్య చెప్పింది కరెక్ట్ అని అర్థం చేసుకొని రామచంద్ర తో కలవడానికి ప్రయత్నిస్తుంది.
కానీ రామ చంద్ర మాత్రం లక్ష్యానికి చేరుకునే వరకు ఇలాంటివి ఏమి వద్దు అంటూ జానకి కి చెప్తాడు. అలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది కానీ రామచంద్ర ఒప్పుకోడు. దీనితో ఆమె రెండు రోజులు సరదాగా బయటకి వెళ్దాం, కచ్చితంగా ప్లాన్ చెయ్యి అని అంటుంది, కనీసం అక్కడైనా వీళ్లిద్దరు దగ్గరై శోభనం చేసుకొని పిల్లల్ని కంటారో లేదో అని కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.