Jagapathi Babu: జగపతిబాబు పైకి చాలా కామ్ గా కనిపిస్తారు. ఆయన మౌన ముని అని చెప్పొచ్చు. ఆలోచనా విధానం చాలా భిన్నమైనది. బాగా ఆధునికంగా ఆలోచిస్తారు. కష్టనష్టాల్లో ఒకేలా ఉండాలి. జీవితానికి పరిమితులు లేకుండా బ్రతకాలి అంటారు. క్యాస్ట్ సిస్టమ్ కి కూడా వ్యతిరేకి. ఆ విషయంలో సొంత సామాజిక వర్గాన్ని కూడా విమర్శిస్తారు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం మీద కూడా మాట్లాడారు. ఒక 15 ఏళ్ల క్రితం సిద్ధార్థ కాలేజ్ కి గెస్ట్ గా వెళ్ళాను. కాలేజ్ యాజమాన్యంతో క్యాస్ట్ కి వ్యతిరేకంగా మాట్లాడతాను అని చెప్పాను. ఓ సామాజిక వర్గానికి చెందిన స్టూడెంట్స్ 2000 మంది ఉన్నారు. ఆ ఆడిటోరియం చాలా చిన్నది, మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు… దయచేసి అలాంటి కామెంట్స్ చేయకండి, సార్ అని వారు చెప్పారని జగపతిబాబు అన్నారు.
Also Read: Balakrishna- Tarakaratna: తారకరత్న కోసం క్రేజీ ప్రాజెక్ట్ ని ఆపేసిన బాలయ్య..నిరాశలో ఫ్యాన్స్
తన ఇద్దరు కూతుళ్ళ గురించి కూడా ఊహించని కామెంట్స్ చేశారు. నాకు ఇద్దరు కూతుళ్లు ఒక అమ్మాయి అమెరికన్ ని వివాహం చేసుకుంది. రెండో అమ్మాయికి పెళ్లి వద్దన్నాను. ఒకవేళ పెళ్లి ఆలోచన ఉంటే నువ్వే ఒక అబ్బాయిని వెతుక్కో అని నేరుగా చెప్పాను. పెళ్లి, పిల్లలంటూ మనకున్న అభిప్రాయాలు, ఆశలు వాళ్ళ మీద రుద్దకూడదు అని జగపతిబాబు అన్నారు. వివాహ వ్యవస్థ మీద కూడా తనకు నమ్మకం లేదన్నారు.
2015లో జగపతిబాబు పెద్ద కుమార్తె మేఘన అమెరికన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వివాహం మాత్రం హైదరాబాద్ లో చేశారు. అబ్బాయి పేరు చద్ బోవెన్. మేఘన అమెరికాలో చదువుకున్నారు. అప్పుడే చద్ బోవెన్ ని ప్రేమించారు. జగపతిబాబు సీనియర్ ప్రొడ్యూసర్ విబి రాజేంద్రప్రసాద్ కుమారుడు. మాస్ హీరోగా ఎదగాలని కెరీర్ బిగినింగ్ లో యాక్షన్ సినిమాలు చేశారు. అవేమీ ఫలితం ఇవ్వలేదు.
ఫ్యామిలీ చిత్రాల హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. ఈ తరం శోభన్ బాబు అనిపించుకున్నారు. 90వ దశకంలో జగపతిబాబు కెరీర్ పీక్స్ కి చేరింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. 2014లో విడుదలైన లెజెండ్ మూవీతో విలన్ గా మారాడు. ఆ సమయంలో ఆయన హీరోగా స్ట్రగుల్ అవుతున్నారు. జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. సౌత్ ఇండియాతో పాటు నార్త్ సినిమాల్లో విలక్షణ పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు.
Also Read:Dil Raju- Harish Shankar: పవన్ సినిమా గ్యాప్ లో.. దిల్ రాజు తో హరీష్ శంకర్ కొత్త సినిమాకు రెడీ..