Balakrishna- Tarakaratna: ఈమధ్య కాలం లో నందమూరి అభిమానులను మరియు సినీ ఇండస్ట్రీ ని ఎంతో ఆందోళన కి గురి చేసిన సంఘటన నందమూరి తారకరత్న కి గుండెపోటు రావడం.ఈమధ్యనే తెలుగు దేశం పార్టీ లో అధికారికంగా చేరిన తారకరత్న, నారాలోకేష్ తలపెట్టిన పాదయాత్ర కార్యక్రమ ప్రారంభోత్సవం లో పాల్గొన్నాడు.అక్కడ అభిమానుల తాకిడి విపరీతంగా ఉండడం తో శరీరం మొత్తం డీహైడ్రేట్ అయ్యి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు.దాంతో వెంటనే ఆయనని సమీపం లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించినా ఉపయోగం లేకపోవడం తో బెంగళూరుకు తరలించారు.
Also Read: Dil Raju- Harish Shankar: పవన్ సినిమా గ్యాప్ లో.. దిల్ రాజు తో హరీష్ శంకర్ కొత్త సినిమాకు రెడీ..
ఇంకా స్పృహ లోకి రాకపోవడం తో ఆయనకీ మరింత మెరుగైన వైద్యం అందించేందుకు విదేశాలకు తరలిస్తున్నారు.ఇదంతా నందమూరి బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, తారకరత్న కి ఇలా జరిగిన క్షణం నుండి నేటి వరకు బాలయ్య బాబు సరిగ్గా నిద్రపోయిన రోజులు కూడా లేవు.అన్నయ్య కొడుకు మీద ఆయనకీ ఉన్న ప్రేమని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇది ఇలా ఉండగా బాలయ్య బాబు తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడితో అనే విషయం మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెలలోనే జరగాల్సి ఉంది, వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్లాన్ చేసారు.కానీ ప్రస్తుతం బాలయ్య తారకరత్న పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో లేనట్టు తెలుస్తుంది.అనిల్ రావిపూడికి కూడా ఈ విషయం బాలయ్య ఈమధ్యనే తెలిపాడట.
కొన్ని రోజులు ఆగాల్సి ఉంటుందని, ఈలోపు నీకేమైనా కమిట్మెంట్స్ ఉంటే పూర్తి చేసుకో అని చెప్పాడట,ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. వరుసగా ‘అఖండ’ , ‘వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి జోష్ మీదున్న బాలయ్య నుండి తొందరగా హ్యాట్రిక్ చూసేయాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ ఎదురు చూపులను ఈసారి ఎక్కువ కాలం కొనసాగించేలా అనిపిస్తుంది.
Also Read: Ori Vaari – Lyrical Video : ఓరి వారి నీది కాదురా పోరి: కీర్తి సురేష్ తో నాని లవ్ బ్రేకప్