
CM Jagan: ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కీలకం. అందులోను అధికార పార్టీపై మరింత ఒత్తిడి ఉంటుంది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలోను పయనిస్తున్నట్లు కనిపిస్తున్నజగన్ రాష్ట్రమంతా పార్టీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తీసివేతలు మొదలవడంతో, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గాల వారీగా నివేదికల ఆధారంగా కొన్ని చోట్ల కొత్త అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది.
Also Read: Turkey backstabs India : అంత సాయం చేసినా కశ్మీర్ పై విషం కక్కిన టర్కీ.. ధీటుగా బదులిచ్చిన భారత్
సొంత పార్టీ నాయకుల కంటే సొంత మీడియా, ఐ ప్యాక్ టీం నివేదికలను ఎక్కువగా జగన్ నమ్ముతున్నారు. వారిచ్చే రిపోర్టుల ఆధారంగానే ఎమ్మెల్యేలకు తలంటుతున్నారు. వ్యతిరేకత, వర్గ పోరు ఎదుర్కొంటున్న చోట కొత్త వ్యక్తులను ప్రకటించనున్నట్లు సంకేతాలు పంపడంతో పార్టీ అభ్యర్థుల్లో వణుకు మొదలైంది.
ఇటీవల నియోజకవర్గాల వారీగా నివేదికలను తెప్పించుకున్న జగన్ నిత్యం ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలను సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించి ఇంటింటికి వెళ్లాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం 175కు 175 స్థానాలు సాధించాలని టార్గెట్ పెట్టారు.

విశాఖలో చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ అనంతరం మరో రెండు కార్యక్రమాలు జూన్, జలై లోపు పూర్తవుతాయి. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని భావిస్తున్నా, ప్రజల్లో వ్యతిరేకత మాత్రం తగ్గలేదు. దీంతో ఆయా సదస్సులను కూడా బేస్ చేసుకొని ప్రచారం చేపట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమాలన్ని పూర్తయిన తరువాత జగన్ ఒకేసారి 175 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు.
ప్రస్తుత పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ ఎదురుచూస్తుంది. అదే గనక జరిగితే జగన్ మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ఒకవేళ అన్ని స్థానాలు గెలవకపోతే అన్ని పనులు మానుకొని రాష్ట్రం మొత్తం తిరేగేలా ‘పల్లెనిద్ర’ చేపడతారని తాడేపల్లి నుంచి వార్తలు అందుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన అనంతరం రాష్ట్రమంతా చుట్టేసేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read:Adipurush: ‘ఆదిపురుష్’ చిత్రం ఇక విడుదల అవ్వదా..!ప్రభాస్ అభిమానులకు గుండెలు పగిలిపొయ్యే వార్త