Turkey backstabs India : అంత సాయం చేసినా కశ్మీర్ పై విషం కక్కిన టర్కీ.. ధీటుగా బదులిచ్చిన భారత్

Turkey backstabs India : పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది. భూకంపంతో నిండా మునిగిందని టర్కీకి మన భారత్‌ సాయం చేస్తే అది ఆ సాయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా భారత్‌పై విషం కక్కింది. మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. ఐక్యరాజ్యసమితిలో మన శత్రువైన పాకిస్తాన్‌కు మద్దతుగా కశ్మీర్‌పై మళ్లీ పాతపాటే పాడింది. అంత సాయం చేసినా కూడా భారత్‌ కు వ్యతిరేకంగానే వ్యవహరించింది. నిజమైన విషనాగు అని టర్కీ అనిపించుకుంది. ఈ బుద్దిపోనిచ్చుకోని టర్కీకి […]

Written By: NARESH, Updated On : March 6, 2023 2:24 pm
Follow us on

Turkey backstabs India : పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుంది. భూకంపంతో నిండా మునిగిందని టర్కీకి మన భారత్‌ సాయం చేస్తే అది ఆ సాయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా భారత్‌పై విషం కక్కింది. మరోసారి తన వక్రబుద్దిని చూపించింది. ఐక్యరాజ్యసమితిలో మన శత్రువైన పాకిస్తాన్‌కు మద్దతుగా కశ్మీర్‌పై మళ్లీ పాతపాటే పాడింది. అంత సాయం చేసినా కూడా భారత్‌ కు వ్యతిరేకంగానే వ్యవహరించింది. నిజమైన విషనాగు అని టర్కీ అనిపించుకుంది. ఈ బుద్దిపోనిచ్చుకోని టర్కీకి భారత్‌ గట్టిగానే బదులిచ్చింది. ఇలాంటి దేశాల విషయంలో భారత్‌ మానవీయత చూపించి వేస్ట్‌ అని పలువురు కామెంట్‌ చేస్తున్న పరిస్థితినెలకొంది..

ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ సమావేశం..
ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 75వ సెషన్‌లో ముందుగా రికార్డ్‌ చేయబడిన సందేశంలో   టర్కీ విదేశాంగ మంత్రి రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ కాశ్మీర్‌ సమస్యపై మాట్లాడారు. పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘దక్షిణాసియా స్థిరత్వం మరియు శాంతికి కీలకమైన కాశ్మీర్‌ వివాదం ఇప్పటికీ మండుతున్న సమస్య. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు తర్వాత తీసుకున్న చర్యలు సమస్యను మరింత జటిలం చేశాయి. ‘‘యుఎన్‌ తీర్మానాల చట్రంలో మరియు ముఖ్యంగా కాశ్మీర్‌ ప్రజల అంచనాలకు అనుగుణంగా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మేము అనుకూలంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు.

ఖండించిన భారత ప్రతినిధి..
టర్కీ ప్రతినిధి ఎర్డోగన్‌ చేసిన వ్యాఖ్యలపై భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఖండించారు. ‘‘భారత భూభాగం జమ్మూ – కాశ్మీర్‌పై టర్కీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా ఉన్నాయి. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. టర్కీ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. దాని స్వంత విధానాలను మరింత లోతుగా ప్రతిబింబించాలి’’ అని తిరుమూర్తి స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ పర్యటనలో కూడా టర్కీ దీనిని లేవనెత్తింది. ఇటువంటి వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ‘పాకిస్తాన్‌ చాలా కఠోరంగా ఆచరిస్తున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని సమర్థించడానికి టర్కీ పదేపదే ప్రయత్నాలు చేస్తోంది’ అని స్పష్టం చేశారు.

పుణ్యం చేయబోతే..
పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు ఉంది టర్కీ తీరు. భారీ భూకంపంతో ఇబ్బంది పడుతున్న టర్కీకి మానవత్వంతో సాయం చేయడానికి ఆపరేషన్‌ దోస్త్‌ పేరుతో భారత్‌ తనవంతు సహకారం అందించింది. అక్కడి ప్రజలు కూడా భారత ఆర్మీని, రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వాహకులను అభినందించారు. తమను కాపాడినందుకు చేతులు ఎత్తి మొక్కారు. కానీ, టర్కీ ప్రధాని మాత్రం తన వక్రబుద్ధిని మరోమారు బయటపెట్టుకున్నారు. విశ్వాసం లేనివారికి సాయం చేసినా ఏమి ప్రయోజనం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.