Homeలైఫ్ స్టైల్Yalukalu And Clove Benefits: ఈ రెండూ నోట్లో వేసుకుంటే చాలు ఎన్నింటికో పరిష్కారం

Yalukalu And Clove Benefits: ఈ రెండూ నోట్లో వేసుకుంటే చాలు ఎన్నింటికో పరిష్కారం

Yalukalu And Clove Benefits
Yalukalu And Clove Benefits

Yalukalu And Clove Benefits: నోటి దుర్వాసన ఉంటే ఎదుటి వారికి ఇబ్బందులు వస్తాయి. నోటి నుంచి వచ్చే వాసనకు ఒక్కొక్కరు ముక్కు మూసుకుంటారు. మన లోపల అనారోగ్య సమస్యలు ఉంటే నోరు వాసన రావడం సహజం. ముందు రోజు మనం తిన్న ఆహారాలు సరిగా జీర్ణం కాకపోతే కూడా ఇలాంటి సమస్యలు వేధిస్తాయి. ఈ నేపథ్యంలో నోటి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కారం ఏమిటి? ఇలా రావడానికి కారణాలేంటి? అనే విషయాలను ఓసారి ఆలోచిస్తే మనం చేసే పనులే మన నోరు దుర్వాసన రావడానికి కారకంగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Turkey backstabs India : అంత సాయం చేసినా కశ్మీర్ పై విషం కక్కిన టర్కీ.. ధీటుగా బదులిచ్చిన భారత్

నోరు దుర్వాసన

పళ్ల సందుల్లో మనం తిన్న ఆహార పదార్థాలు నిల్వ ఉంటే కూడా మన నోరు దుర్వాసన రావడం జరుగుతుంది. నోటిలో చెడు సూక్ష్మజీవులు పెరగడం వల్ల నోటి నుంచి చెడ్డ వాసన వస్తుంది. నోట్లో చెడు బ్యాక్టీరియా పెరిగితే ఇలాంటి వాసన వస్తుంది. ఇటీవల కాలంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ ఏది పడితే అది నోట్లో వేసుకోవడం అలవాటుగా మారింది. దీంతో పళ్ల సందుల్లో ఇరుక్కుపోయి వాటితో నోరు దుర్వాసన వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. పళ్ల మధ్యలో ఇరుక్కున్న పదార్థాలు రాత్రంతా అలాగే ఉండిపోవడం వల్ల బ్యాడ్ స్మెల్ కొడుతుంది.

జీర్ణం కాని..

ఇంకా నోరు దుర్వాసన రావడానికి మరో కారణం మలబద్ధకం. దీంతో మనం తిన్న పదార్థాలు బయటకు వెళ్లకుండా అలాగే ఉండిపోవడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన రావడం సహజమే. మనం సరిగా మలవిసర్జన చేయకపోతే జీర్ణాశయంలో టాక్సిన్లు పేరుకుపోయి నోటి దుర్వాసన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. జీర్ణాశయంలో మనం తిన్న ఆహారాలు జీర్ణం కాకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. మంచినీళ్లు తాగకపోతే కూడా మనం తిన్నవి అరగక నోరు వాసన రావడానికి మార్గాలుంటాయి.

Yalukalu And Clove Benefits
Yalukalu And Clove Benefits

తగినంత నీరు

మనం రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే లీటర్ పావు నీళ్లు తాగాలి. దీంతో వెంటనే మలవిసర్జన చేసే వీలుంటుంది. దీంతో మనకు నోటి దుర్వాసన సమస్య ఉండదు. మూత్రం, మలం సాఫీగా వెళితే ఎలంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఇంకా ఉదయం పూట బ్రష్ కు బదులు వేప పుల్లతో పళ్లు తోముకోవడం ఉత్తమం. అందులో ఉండే చేదు వల్ల మనకు లాలజలం బాగా ఊరి నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. అందుకే ఉదయం వేప పుల్ల మన దవడకు ఉంచుకోవడం వల్ల పలు లాభాలుంటాయి. మన పూర్వీకులు వేప పుల్లతోనే పళ్లు తోముకుని ఆరోగ్యవంతమైన పళ్లు ఉండేలా చేసుకున్నారు.

ఈ రెండు

నోరు దుర్వాసన రాకుండా ఉండాలంటే నోట్లో ఓ యాలుక్కాయ వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. లవంగం కూడా నోట్లో వేసుకుంటే కూడా నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇలా మన ప్రకృతి వైద్య విధానంలో ఎన్నో చిట్కాలున్నాయి. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం కలిగించే వాటిని పాటించి సమస్య నుంచి పరిష్కారం పొందొచ్చు.

Also Read:Adipurush: ‘ఆదిపురుష్’ చిత్రం ఇక విడుదల అవ్వదా..!ప్రభాస్ అభిమానులకు గుండెలు పగిలిపొయ్యే వార్త

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version