
Jabardasth Emmanuel: కామెడీ షో కు పెట్టింది పేరు జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్లుగా మారారు. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాయి. అయితే ఒకప్పటి స్టార్ కమెడియన్లకు ఇతర అవకాశాలు రావడంతో జబర్దస్త్ ను వీడారు. దీంతో కొత్తవారు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలా జబర్దస్త్ షో లో ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు ట్రెండీ కమెడియన్ గా మారాడు. ఆయన చేసే కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వర్షతో చేసే లవ్ ట్రాక్ తో యూత్ ఇంప్రెస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్మాన్యుయేల్ కు ఫాలోవర్స్ పెరిగి ఆయన కామెడీ షోలను వైరల్ చేస్తున్నారు. లేటేస్టుగా ఎక్స్ ట్రా జబర్దస్త్ కు సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో ఇమ్మాన్యుయేల్ వైసీపీ ఎమ్మెల్యే ను అనుకరిస్తూ కామెడీ పండించాలనుకున్నాడు. కానీ ఆ తరువాత దెబ్బలు తినాల్సిన పరిస్థతి ఏర్పడింది. మరోవైపు సదరు ఎమ్మెల్యే అనుచరులు ఇమ్మాన్యుయేల్ పై పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు.
ఎంతో మంది కమెడియన్లకు జీవితాన్ని ప్రసాదించిన జబర్దస్త్ ప్రోగ్రాం ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతోంది. అయితే స్టార్ కమెడియన్లు ఎవరూ లేకపోవడంతో కొత్తవారు తమ ప్రతిభను చూపిస్తున్నారు. ఈ క్రమంలో వారు హైలెట్ గా మారుతున్నారు. ఇలా ‘పటాస్’ అనే షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్ ఆ తరువాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో ఆయనను ఎవరూ పట్టించుకోలేదు. కానీ తనదైన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.టైమింగ్ కామెడీతో పంచ్ లు వేయడం ఇమ్మాన్యుయేల్ ప్రత్యేకత.

ఇమ్మాన్యుయేల్, వర్షలు కలిసి స్కిట్లు ఎక్కువగా చేస్తుంటారు. ఫలితంగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారి తీసిందని చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే వీరి మధ్య హగ్గులు, కిస్సులు కూడా ఉంటాయి. ఫ్యూచర్లో వీరిద్దరు కలిసి జీవిస్తారని అనుకుంటున్నారు. అయితే ఇమ్మాన్యుయేల్ కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర స్పషల్ ఈవెంట్లలోనూ సందడి చేస్తున్నాడు. మిగతా యాంకర్లకు పోటీగా ఆయన కామెడీ ఆకట్టుకోవడంతో పలు షో లనుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయి.
తాజాగా ఈ యంగ్ కమెడియన్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుకరిస్తూ ఓ కామెడీ చేశాడు. ఓ గెటప్ వేసుకుని ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ఇమ్మాన్యుయేల్ చేశాడు. ఇమ్మాన్యుయేల్ ఎమ్మెల్యేగా మారి స్కూల్ పిల్లాడిగా బాబును పెట్టాడు. దీంతో ఇమ్మాన్యుయేల్ బాబును కర్రతో అచ్చం ఎమ్మెల్యేలాగే కొట్టడంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. అయితే చివరగా కమెడియన్లంతా చేరి ఇమ్మాన్యుయేల్ ను చితక్కొట్టారు. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది.
ఈ వీడియోపై ఎమ్మెల్యే కేతిరెడ్డి వర్గం గుర్రుతో ఉంది. ఎమ్మెల్యే ప్రజా కార్యక్రమాలు చేపడితే మీకు కామెడీగా ఉందా? అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కొందరు ఇమ్మాన్యుయేల్ ను హెచ్చించేవిధంగా కామెంట్లు చేయడం గమనార్హం. అయితే ఈ వీడియో ప్రోమోపై ఇలాంటి స్పందన వస్తే.. ఇక ఫుల్ ఎపిసోడ్ పై ఎలాంటి రియాక్షన్ ఉంటుందోనని అందరూ చర్చించుకుంటున్నారు.