
Jabardasth Comedian Ganapathi: సాధారణంగా టీచర్స్ నటులు అవుతుంటారు. బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ ఈ కోవకు చెందినవారే. అయితే ఓ జబర్దస్త్ కమెడియన్ దీనికి భిన్నంగా టీచర్ అయ్యాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఉంది. జబర్దస్త్ కమెడియన్స్ లో ఒకరైన గణపతి అంటే తెలియనివారుండరు. గణపతి ఎక్కువగా హైపర్ ఆది టీమ్ లో స్కిట్స్ చేశాడు. గణపతి సైతం లేడీ గెటప్స్ వేసేవాడు. ఏనుగు లాంటి కారణం కలిగిన భార్య పాత్రల్లో గణపతి అలరించాడు.
గణపతి బాడీ మీద హైపర్ ఆది మంచి మంచి కామెడీ పంచులు రాసుకునేవారు. హైపర్ ఆదితో గణపతి కాంబినేషన్ బాగా క్లిక్ అయ్యింది. చాలా కాలం గణపతి హైపర్ ఆది టీమ్ మెంబర్ గా ఉన్నాడు. ఆ టీం సక్సెస్ లో భాగమయ్యాడు. హైపర్ ఆది జబర్దస్త్ మానేశాక గణపతి కూడా దూరమయ్యాడు. గణపతి జబర్దస్త్ లో కనిపించి చాలా కాలం అవుతుంది. హైపర్ ఆది టీమ్ లో రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ మాత్రమే కనిపిస్తున్నారు.
కాగా గణపతి గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయ్యాడన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గణపతి ఆముదాలవలస మండలంలోని ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా బాధ్యతలు తీసుకున్నాడట. 1998లో డీఎస్సీ క్వాలిఫై అయిన కాండిడేట్స్ లో గణపతి కూడా ఒకరట. ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న వీరికి పోస్టులు ఇచ్చింది. దీంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా గణపతికి గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయ్యే ఛాన్స్ దక్కిందట.

తన సొంత ఊరిలో ఉంటూ టీచర్ గా కొనసాగాలనేది గణపతి కోరిక అట. తనకు ఉద్యోగం రాకపోవడంతో జబర్దస్త్ కమెడియన్ అయ్యాడు. ఇప్పుడు తన కల నెరవేరిందని సంబరపడుతున్నారు. జబర్దస్త్ షోకి వచ్చాక నటులుగా చాలా మంది సిల్వర్ స్క్రీన్ మీద సెటిల్ అయ్యారు. చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, రచ్చ రవి, మహేష్ ఇలా పలువురు కమెడియన్స్ గా కొనసాగుతున్నారు. గణపతి మాత్రం నటనను పూర్తిగా వదిలేసి స్కూల్ టీచర్ అయ్యాడు.