
జబర్ధస్త్.. ఇంటిల్లిపాది ఆహ్లాదంగా నవ్వుకునే ఈ షో గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తెలుగులో నంబర్ 1 షోగా ఉంది. అలాంటి షోలో తాజాగా ఓ స్టార్ కమెడియన్ ఏడ్చేశాడు. ఓ జడ్జి టీం లీడర్ తనపై చూపిస్తున్న వివక్షకు కంటతడి పెట్టేశాడు. తాను అంతా ప్లాన్ చేసి చేపిస్తుంటే తనను కాదని.. వాళ్ల పర్ఫామెన్స్ ను మెచ్చుకోవడం చూసి కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
తాజాగా ఆగస్టు 12న ప్రారంభమయ్యే జబర్ధస్త్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో చివరలో వెంకీ మంకీస్ జబస్ధస్త్ టీం లీడర్ వెంకీ కంటతడి పెట్టారు. స్కిట్ బాగా వచ్చిందని.. తాగుబోతు రమేశ్ సహా అందరూ బాగా చేశారని జడ్జీలు రోజా, మను మెచ్చుకుంటారు.
అయితే అంతా స్కిట్ రాసి చేయించింది తానని.. కానీ తనను కాకుంటా వాళ్ల నటన బాగుందని అనడంతో వెంకీ నొచ్చుకున్నాడు. స్టేజీ మీదే వెనక్కి వెళ్లి గుక్కపట్టి ఏడ్చేశాడు.
తనపై వివక్ష చూపిస్తారని వెంకీ బాధపడగా.. మరో టీం లీడర్ తాగుబోతు రమేశ్ వెళ్లి ఓదార్చాడు. అయితే ఇదంతా స్కిట్ లో భాగంగా జరిగిందా? లేక నిజంగానే వెంకీ ఏడ్చేశాడా? అన్నది ఆగస్టు 12న ప్రసారమయ్యే షోలో తెలుస్తుంది. అంతవరకూ ఓపిక పట్టాల్సిందే.