Kiraak RP Chepala Pulusu: ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. కిరాక్ ఆర్పీ లైఫ్ లో ఒక ఆలోచన వెలుగులు నింపింది. ప్రస్తుతం ఆయన లక్షల వ్యాపారం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ వేదికగా ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్స్ లో ఆర్పీ ఒకరు. నెల్లూరు యాసతో తనకంటూ సపరేజ్ మేనరిజం, కామెడీ టైమింగ్ క్రియేట్ చేసుకొని సక్సెస్ అయ్యాడు. నాగబాబుకు సన్నిహితుడు అయిన కిరాక్ ఆర్పీ ఆయనతో పాటు జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాడు. నాగబాబు కొత్తగా స్టార్ట్ చేసిన అదిరింది షోలో స్కిట్స్ చేశాడు. దర్శకుడు కావాలన్నది ఆర్పీ కోరిక. తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ తో నిర్మాతను పట్టుకొని సినిమా స్టార్ట్ చేశాడు.

కిరాక్ ఆర్పీ సినిమా ఓపెనింగ్ కి నాగబాబు అతిథిగా హాజరై ఆశీర్వదించాడు. అనుకోని కారణాలతో ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. డైరెక్టర్ కావాలన్న కిరాక్ ఆర్పీ కోరిక నెరవేరలేదు. ఇవన్నీ కాదు జీవితంలో ఎదగాలంటే వ్యాపారమే కరెక్ట్ అని నమ్మిన కిరాక్ ఆర్పీ తన దగ్గరున్న సేవింగ్స్ తో కర్రీ పాయింట్ ఏర్పాటు చేశాడు. మిగతా వారిలా చిన్న వ్యవస్థగా కాకుండా పెద్ద సెటప్ ఏర్పాటు చేశాడు.
ఇతర రాష్ట్రాల జనాలు, జాబ్ సీకర్స్, స్టూడెంట్స్, బ్యాచ్ లర్స్ అధికంగా ఉండే కూకట్ పల్లి ఏరియాను ఎంచుకున్నాడు. రూ. 40 లక్షల పెట్టుబడితో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే బ్రాండ్ నేమ్ తో కర్రీ పాయింట్ ఏర్పాటు చేశాడు. వివిధ సైజులు, రకాల చేపలను తాజాగా తెచ్చి రుచికరమైన పులుసు చేసి అమ్ముతున్నాడు. పది మందికి పైగా వంటవాళ్ళు, కూలీలు ఆర్పీ దగ్గర పని చేస్తున్నారట.

కూకట్ పల్లికి దూరంగా వంటశాల ఏర్పాటు చేసి అక్కడ వండిన కూరలు కూకట్ పల్లి పాయింట్ కి తెచ్చి అమ్ముతున్నాడు. అనతి కాలంలోనే ఈ బిజినెస్ సక్సెస్ అయ్యిందట. కిరాక్ ఆర్పీ పెట్టుబడి రూ. 40 లక్షలు వెనక్కి వచ్చేసిందట. పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్న ఆర్పీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. కమెడియన్ గా, డైరెక్టర్ గా పూర్తి స్థాయిలో సక్సెస్ కానీ కిరాక్ ఆర్పీ… క్రియేటివ్ ఫీల్డ్ నుండి బయటకు వచ్చి చేపల పులుసు వ్యాపారం పెట్టుకొని విజయం సాధించాడు. ఇక అతడి కెరీర్ కి ఢోకా లేదని అర్థం అవుతుంది.