కోడి కూసిందని.. రూ.15 వేలు ఫైన్ వేశారు.. ఎక్కడంటే?

పస్తుతం ఉదయం అలారంతో రోజువారి జీవితం మొదలవుతున్నా దాదాపు రెండు దశాబ్దాల క్రితం కోడి కూతే అలారంలా మనల్ని నిద్ర లేపేది. ఉదయం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు కోడి కూస్తూ నిద్రపోయిన వాళ్లను సైతం మేల్కొనేలా చేసేది. అయితే కాలం మారుతున్న నేపథ్యంలో కోళ్లను పెంచే వారి సంఖ్య భారీగా తగ్గింది. అయితే ఒక కోడి పుంజు కూసిన కూత వల్ల యజమానికి 15 వేల రూపాయల జరిమానా విధించడంతో కోడి వార్తల్లో […]

Written By: Kusuma Aggunna, Updated On : August 16, 2020 10:29 am
Follow us on

పస్తుతం ఉదయం అలారంతో రోజువారి జీవితం మొదలవుతున్నా దాదాపు రెండు దశాబ్దాల క్రితం కోడి కూతే అలారంలా మనల్ని నిద్ర లేపేది. ఉదయం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు కోడి కూస్తూ నిద్రపోయిన వాళ్లను సైతం మేల్కొనేలా చేసేది. అయితే కాలం మారుతున్న నేపథ్యంలో కోళ్లను పెంచే వారి సంఖ్య భారీగా తగ్గింది. అయితే ఒక కోడి పుంజు కూసిన కూత వల్ల యజమానికి 15 వేల రూపాయల జరిమానా విధించడంతో కోడి వార్తల్లో నిలిచింది. ఇటలీలోని విదార్దో పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?

ఎంగేలో బొలెట్టీ అనే 80 సంవత్సరాల వృద్ధుడు కార్గినో అనే కోడిపుంజును ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. ప్రతిరోజూ 4.30 గంటల సమయంలో ఆ కోడి కూస్తుంది. అయితే ఇరుగుపొరుగు వారికి మాత్రం ఆ కోడి కూత తలనొప్పిగా మారింది. దీంతో వాళ్లు బొలెట్టీని పలుమార్లు హెచ్చరించారు. బొలెట్టీ కోడిని ఇంట్లో బంధించలేని పరిస్థితి. ఇరుగుపొరుగు వాళ్లు చివరకు కోడిపుంజుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Also Read: రూ.1 ‘ఫీజు’కే కాలేజీలో అడ్మిష‌న్.. ఎక్కడంటే?

పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ కోడిపుంజుపై నిఘా పెట్టగా తెల్లవారుజాము నుంచి కోడి బిగ్గరగా అరుస్తూనే ఉంది. దీంతో పోలీసులు ఇండియన్ కరెన్సీ ప్రకారం 15 వేల రూపాయలు జరిమానా విధించారు. కోడిపుంజు కూత పొరుగింటి వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉండటం వల్లే జరిమానా విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మేయర్ పెర్ఫెట్టి గత నెలలోనే హెచ్చరించినా కోడిపుంజు విషయంలో తీరు మార్చకపోవడంతో జరిమానా విధించామని తెలిపారు.