
RGV: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవరికీ అర్థం కాని మెటీరియల్. అతడు సమాజాన్ని పట్టించుకోడు. నచ్చింది చేస్తూ బ్రతికేస్తాడు. ఒకప్పుడు దేశం మెచ్చిన చిత్రాలు తీసిన వర్మ కాంట్రవర్సీతో పబ్బం గడుపుకునే స్థాయికి పడిపోయాడు. తనని తాగుబోతు, తిరుగుబోతుగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. ప్రపంచంలోని ప్రతి సమస్యకు వర్మ వద్ద సమాధానం ఉంటుంది. అలాగే వర్మతో వాదించి ఎవరూ గెలవలేరు. కారణం… మీరు వెధవ అంటే, అవును నేను అదే అయితే ఏంటి అంటారు. దాంతో డిబేట్ ఎండ్ అయిపోతుంది.
వర్మ లాంటి పర్సనాలిటీస్ పాశ్చాత్య దేశాల్లో కూడా కనిపించవు. ఆయన తరహా విచ్చలవిడి జీవన విధానం ఎవరూ కలిగి ఉండరు. అసలు వర్మ ఒక దశకు వచ్చాక ఇలా తయారయ్యాడా? లేక మొదటి నుండి ఇంతేనా? అనే ఒక సందేహం అందరిలో ఉంది. దీనికి వాళ్ళ అమ్మ సమాధానం చెప్పారు. వర్మ బాల్యం నుండే తేడా అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక యూట్యూబ్ ఛానల్ లో సూర్యమ్మ, వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వర్మ స్కూల్ కి వెళ్ళడానికి మారాం వేసేవాడు. యూనిఫార్మ్ వేశాక అల్లరి చేయకుండా స్కూల్ కి వెళ్లిపోయేవాడు. ఒకసారి 100 కి 90 మార్కులు తెచ్చుకునేవాడు. మరోసారి కేవలం 30 మార్కులే వచ్చేవి. ఏంట్రా నువ్వు చదివిన ప్రశ్నలు రాలేదా? అని అడిగితే… అన్నీ తెలిసిన ప్రశ్నలే వచ్చాయి. కానీ నాకు రాయాలి అనిపించలేదని సమాధానం చెప్పేవాడని సూర్యమ్మ వర్మ వింత ప్రవర్తన గురించి వెల్లడించారు.
సాధారణంగా పరీక్షల్లో చదివిన ప్రశ్నలు వస్తే… అన్నీ రాసేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని స్టూడెంట్స్ ఆత్రుత పడతారు. వర్మ మాత్రం తనకు మూడ్ ఉంటేనే రాస్తారు. లేదంటే వదిలేసి రెస్ట్ తీసుకుంటాడు. బహుశా మార్క్స్ ప్రామాణికం కాదు, నాలెడ్జ్ అని నమ్ముతాడేమో.అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో కూడా వర్మ ఇలానే ఉండేవాడట. అతనితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఓ డైరెక్టర్ ఇటీవల వర్మ బిహేవియర్ గురించి చెప్పాడు. ఆయన మొదటి నుండి ఇదే టైపని చెప్పి షాక్ ఇచ్చాడు.
