Homeఆంధ్రప్రదేశ్‌AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే..

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే..

AP Cabinet Decisions : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలకు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటిలో 45 అంశాలపై చర్చించారు. దాదాపు 15 అంశాలకు ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కేబినెట్ భేటి అనంతరం వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 1న ఆర్బీఐ సెలవు అని.. 2వ తేదీ ఆదివారం కావడంతో ఏపీలో పింఛన్ల పంపిణీ 3వ తేదీన ఉంటుందన్నారు.

విశాఖ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఆస్కార్ కొట్టిన ఆర్ఆర్ఆర్ టీంను అభినందనలు తెలిపారు. ఇక ఈ కేబినెట్ భేటిలో అత్యంత కీలకమైన అంశం.. విశాఖను రాజధానిగా ప్రకటించడం.. విశాఖను పారిశ్రామికవేత్తలు అంతా రాజధానిగా ఆహ్వానించారని జగన్, మంత్రులు తెలిపారు. విశాఖ కేంద్రంగానే పాలన సాగుతుందని జగన్ స్పష్టం చేశారు.

-జగన్ కేబినెట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

● పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం.

● ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం

● అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

● దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.

● ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్

● అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం

● ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు – 2023 కు ఆమోదం

● జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు.

● ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం

● హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం

● టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version