Bigg Boss 6 Telugu- Sri Satya Father: బిగ్ బాస్ హౌస్ కి ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ గా మారిపోయింది..బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సంబంధించిన తల్లిదండ్రులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంటర్ అవ్వడం..చాలా కాలం తర్వాత తమ సొంత మనుషులను చూసుకొని కంటెస్టెంట్స్ మురిసిపోవడం..భావోద్వేగానికి లోనవ్వడం వంటివి ప్రేక్షకులను కూడా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేసింది..వారం మొత్తం టాస్కులు, గొడవలు లేకుండా మొత్తం సెంటిమెంట్ మరియు ఎంటర్టైన్మెంట్ తో ఈ వారం బిగ్ బాస్ హౌస్ అదిరిపోయింది..ఇక చూసే ప్రతీ ప్రేక్షకుడి మనసుల్ని కదిలించిన పేరెంట్స్ ఎవరు అంటే శ్రీ సత్య తల్లిదండ్రులు అని చెప్పొచ్చు.

శ్రీ సత్య తల్లి కి కాళ్ళు బాగాలేవు అనే విషయం తెలిసిందే..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే శ్రీ సత్య ఈ విషయం పంచుకొని హౌస్ మేట్స్ అందరిని ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది..తన తల్లికి కాళ్ళు పనిచెయ్యనప్పటి నుండి మా నాన్న గారే అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని..నా కుటుంబం మొత్తం నేను సంపాదించే డబ్బుల మీదనే ఆధారపడుందని చెప్పుకొచ్చింది శ్రీ సత్య.
వీల్ చైర్ మీద కూర్చున్న శ్రీ సత్య అమ్మని తోసుకుంటూ నాన్న హౌస్ లోకి అడుగుపెడతాడు..శ్రీ సత్య వాళ్ళని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది..ఆ తర్వాత ఇంటి సభ్యులందరినీ కలిసిన తర్వాత కాసేపు ఏకాంతం గా తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది శ్రీ సత్య..నా ఆట ఎలా ఉంది అని వాళ్ళ నాన్న ని అడగగా ‘మొదటి మూడు వారాలు చక్కగానే ఉన్నావ్..నాల్గవ వారం నుండి ఎందుకు అలా అయిపోయావ్..చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్..వెటకారం కూడా ఎక్కువైపోయింది..అవన్నీ తగ్గించుకుంటే కప్పు కొడతావ్’ అంటూ శ్రీ సత్య కి చెప్తాడు..ఆ తర్వాత ఇంటి సభ్యులతో కాసేపు ముచ్చటిస్తారు శ్రీ సత్య తల్లిదండ్రులు.

రేవంత్ గురించి మాట్లాడుతూ ‘హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి వారం రేవంత్ నన్ను చాలా సిల్లీ రీజన్ తో నామినేట్ చేసాడు..బాగా మాట్లాడుతున్న కానీ తనకి కనెక్ట్ కాలేదంటా..ఆ రీజన్ తో నామినేట్ చేసాడు’ అని వాళ్ళ నాన్న కి చెప్తుంది..అప్పుడు ఆమె నాన్న దానికి సమాధానం చెప్తూ ‘నువ్వు కూడా చాలా సార్లు పనికిమాలిన రీజన్స్ చెప్పి నామినేట్ చేసావు లే’ అని కౌంటర్ ఏస్తాడు..ఎపిసోడ్ మొత్తానికి శ్రీ సత్య పేరెంట్స్ ఇంటికి రావడం హైలైట్ గా నిలిచింది.