Bigg Boss 6 Telugu- Srihan And Siri: బిగ్ బాస్ గత సీజన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన కంటెస్టెంట్ ‘సిరి’..షణ్ముఖ్ తో ఈమె బిగ్ బాస్ హౌస్ లో నడిపిన ప్రేమాయణం..చేసిన రొమాన్స్ ని అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..షణ్ముఖ్ వంటి ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ తో క్లోజ్ గా ఉన్నింది కాబట్టి ఈమె టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది..కానీ బయట కాబొయ్యే భర్త శ్రీహాన్ ఉన్నప్పటికీ కూడా అతను ఏమి అనుకుంటాడో అని కూడా లేకుండా షణ్ముఖ్ తో ఈమె గారు నడిపిన రొమాన్స్ చూసే వారికి చాలా ఇబ్బందిగా అనిపించింది.

అప్పట్లో ప్రస్తుతం నడుస్తున్నట్టుగానే ఫ్యామిలీ వీక్ నడిచినప్పుడు శ్రీహాన్ సిరి కోసం వస్తాడు..సిరి చూసిన వెంటనే ‘వదిలేస్తున్నావా రా’ అని అడుగుతాడు శ్రీహాన్..అప్పట్లో చాలా మందికి శ్రీహాన్ ని చూసి పాపం అనిపించింది..ఇప్పుడు సీజన్ 6 లో శ్రీహాన్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు..గత రెండు రోజుల నుండి కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు వస్తూ ఉన్నారు.
రేపు శ్రీహాన్ కోసం ‘సిరి’ వస్తుంది..దీనికి సంబంధించిన ప్రోమో ని ఈరోజు ఎపిసోడ్ చివరున వేస్తారు..హౌస్ లోకి అడుగుపెట్టగానే శ్రీహాన్ ని కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటుంది సిరి..ఆ తర్వాత సిరి శ్రీహాన్ దత్తత తీసుకున్న బాబు కూడా హౌస్ లోకి ఎంటర్ అవుతాడు..రేపు ఎపిసోడ్ లో సిరి శ్రీహాన్ తో మరియు హౌస్ మేట్స్ తో ఏమి మాట్లాడుతుందో చూడాలి.

శ్రీహాన్ సిరి లాగా హద్దులు దాటి రొమాన్స్ కానీ, ప్రేమాయణం కానీ ఏ కంటెస్టెంట్ తో నడపకపోవడం వల్ల అతను భయపడాల్సిన అవసరం రాలేదు..హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి శ్రీహాన్ తన హద్దుల్లోనే ఉంటూ వచ్చాడు..శ్రీ సత్య తో బాగా క్లోజ్ గా ఉన్నప్పటికీ అది ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చూసే ప్రతి ప్రేక్షకుడికి అర్థం అవుతుంది..చూడాలి మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో.