
Rashi Khanna: టాలీవుడ్ లో అందం తో అభినయం సమానంగా చూపించగలిగే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు..ఆ తక్కువ మందిలో ఒకరే రాశి ఖన్నా..విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన మనం సినిమా లో ఒక చిన్న పాత్ర ద్వారా తొలిసారి వెండితెర కి పరిచయమైనా రాశి ఖన్నా, ఆ తర్వాత నాగ శౌర్య హీరో గా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ మన అందరికీ పరిచయం అయ్యింది.
తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న రాశి ఖన్నా కి అవకాశాలు వెల్లువలా వచ్చాయి.ఈమె కెరీర్ లో హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి కానీ స్టార్ హీరోల సరసన మాత్రం హీరోయిన్ గా నటించే అవకాశాలు రావడం లేదు.ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తో తప్ప ఇప్పటి వరకు ఈమె ఒక్క స్టార్ హీరో తో కూడా నటించలేదు.
తెలుగు లో ఈమె ఆఖరి సూపర్ హిట్ సినిమా ‘ప్రతి రోజు పండగే’..ఆ తర్వాత ఈమె చేసిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ మరియు థాంక్యూ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.దాంతో ఈమెకి అవకాశాలు ఇవ్వడానికి భయపడిపోతున్నారు దర్శకనిర్మాతలు..దానికి తోడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఆమె చేసిన కామెంట్స్ కూడా ఆమెకి అవకాశాలు రాకుండా పోవడానికి కారణమని అంటున్నారు విశ్లేషకులు..గతం లో ఈమె టాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే అందం గా ఉండాల్సిందే,ప్రతిభ ని చూసి ఇక్కడ ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరూ అంటూ పెను దుమారం రేపే కామెంట్స్ చేసింది.

అప్పటి నుండి టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఈమెపై అనధికారిక బ్యాన్ విధించిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అయితే టాలీవుడ్ లో ఈమెకి అవకాశాలు రాకపోయినప్పటికీ కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో మాత్రం మంచిగా అవకాశాలు వస్తున్నాయి..తమిళం లో ఈమె రీసెంట్ గా చేసిన తిరుచిత్రం బలం మరియు సర్దార్ వంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి, దీనితో పాటు హిందీ లో ఈమె యోదా అనే చిత్రం లో కూడా నటిస్తుంది.