
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ తిరువనంతపురంలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ గవర్నమెంట్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రంపై మండిపడ్డాడు. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఎవరు ప్రొడ్యూసర్ చేశారో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం ఆస్కార్స్ కి నామినేట్ కాలేదని దర్శకుడు బాధపడుతున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కి ఆస్కార్ కాదు కదా కనీసం భాస్కర్ అవార్డు కూడా రాదు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సభ్యులే అదో చెత్త సినిమా అని ముఖం మీద ఉమ్మేశారు. అయినా వీళ్లకు సిగ్గు రాలేదు.
ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ఎవరు నిర్మించారో అందరికీ తెలుసు. బీజేపీ గవర్నమెంట్ తమ ప్రోపగాండాలో భాగంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఇలాంటి చిత్రాలు నిర్మించేందుకు ఓ 2000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సమాచారం. ప్రతిసారి ప్రజలను మోసం చేయలేరు. పఠాన్ సినిమాను ఈ ఇడియట్స్ బ్యాన్ చేయాలన్నారు. ఇప్పుడు ఆ సినిమా రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. మోడీ బయోపిక్ కి కనీసం రూ. 30 కోట్లు రాలేదు. వీరు కేవలం అరిచే కుక్కలు మాత్రమే, కరవ లేవు. సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ 90లలో కాశ్మీర్ లో పండిట్స్ పై ముస్లింలు జరిపిన మారణహోమం నేపథ్యంలో తెరకెక్కింది. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ గవర్నమెంట్ తెరపైకి తెచ్చిన సబ్జెక్టు అనే అపవాదు ఉంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 వేదికపై ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రదర్శించారు. IFFI జ్యూరీ హెడ్ నవద్ లాపిడ్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ తనను చాలా డిస్టర్బ్ చేసిందని, ఇదో వల్గర్ మూవీ అన్నారు. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి చిత్రం ప్రదర్శించడం దారుణ పరిణామం అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

కాగా ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ కి ఇండియా తరపున పది చిత్రాలు వరకు షార్ట్ లిస్ట్ అయ్యాయి. వాటిలో ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం కూడా ఉంది. ఫైనల్ నామినేషన్స్ లో ఈ చిత్రానికి చోటు దక్కలేదు. దానికి ది కాశ్మీర్ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి నిరాశ వ్యక్తం చేశారు. ఇక ది కాశ్మీర్ ఫైల్ కమర్షియల్ గా విజయం సాధించడం విశేషం. ఈ మూవీ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలు చేశారు.