https://oktelugu.com/

Viral Video: అమ్మ ఉన్నచోట ఆకలి ఉండదు.. బిడ్డకు ఏడుపు కూడా ఉండదు.. కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తున్న వీడియో..

అమ్మ ఉన్నచోట ఆకలి ఉండదు.. అమ్మ ప్రేమ విస్తరించినచోట కన్నీటికి తావు ఉండదు. పై సూక్తులను నిజం చేసేలాగా ఓ సంఘటన చోటు చేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 10, 2024 / 10:26 AM IST
    Follow us on

    Viral Video: ఆ వీడియోలో చూపించిన దృశ్యాల ప్రకారం.. నిండు గర్భిణిగా ఉన్న ఓ మహిళ ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ చూడటానికి అందంగా ఉన్నాడు. చలికాలం కావడంతో ఆ పసిబిడ్డకు కాస్త వెచ్చదనం కావాలని.. వైద్యులు ఇంక్యూ బేటర్ లో పెట్టారు. దానికి అప్పటినుంచి ఆ చిన్నారి ఏడుపు మొదలుపెట్టాడు. ఎంతసేపటికి ఏడుపు ఆపడం లేదు. అక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బంది ఊరడించినప్పటికీ అతడు ఏడుపు తగ్గించడం లేదు. పైగా అతడు ఏడుస్తున్న ఏడుపుకు ఆస్పత్రి మార్మోగిపోతోంది. దీంతో తట్టుకోలేక ఆ వైద్య సిబ్బంది ఆ చిన్నారిని తల్లి వద్దకు తీసుకువచ్చారు. ఆమె ఆ బిడ్డను దగ్గరికి తీసుకుంది. ప్రేమతో నుదురు మీద ఒక ముద్దు పెట్టింది. దీంతో అతడు ఏడుపు తగ్గించాడు. అంతేకాదు తల్లిని చూడగానే నవ్వాడు. దీంతో ఆ అమ్మ కూడా మురిసిపోయింది. తన ప్రసవ వేదనను మరిచిపోయింది. బిడ్డను చూడగానే 1000 ఏనుగుల బలాన్ని పొందింది. ఈ వృత్తాంతాన్ని ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది వీడియో తీసి సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో నెట్టింట విపరీతమైన సందడి చేస్తోంది.

    అమ్మ మాధుర్యం తెలిసింది

    ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిస్తోంది. పలువురు నెటిజన్లు ఈ వీడియో పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు..” తల్లి ప్రేమ చాలా గొప్పది. అది వెలకట్టలేనిది. ఆ చిన్నారి తన మాతృమూర్తిని చూడగానే పరవశించిపోయాడు. ఏడుపు ఆపేశాడు..ఆ తల్లి కూడా తన కుమారుడిని చూడగానే ఆనందపడింది. ప్రేమతో నుదుటిమీద ముద్దు ఇచ్చింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఈ ప్రపంచంలో కల్తీ లేని ప్రేమ అంటే తల్లిది మాత్రమే. వెలకట్టలేనిది కూడా తల్లి ప్రేమ మాత్రమే. అందుకే అమ్మ ఉన్నచోట ప్రేమకు కొదువ ఉండదు. ఏడుపుకు చోటు ఉండదు. ఆకలికి ఆస్కారం ఉండదు. అలాంటి అమ్మలను కాపాడుకోవాలి. ఈ జగతిని మరింత ప్రేమమయం చేయాలి. ప్రేమ ఉన్నచోట ద్వేషానికి తావు లేదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడో విదేశాల్లో జరిగినట్టు తెలుస్తోంది.. అక్కడి వాతావరణం చూస్తే అలాగే కనిపిస్తోంది. ” దేశాలు దాటినా.. అమ్మ ప్రేమ మాత్రం ఒకటే. ఆ మాధుర్యానికి ఎల్లలు ఉండవు. ఆ అనురాగానికి హద్దులు ఉండవు. బిడ్డను చూడగానే ఆ తల్లి ఆనందం మాటల్లో చెప్పలేనిది. తన బాధను మొత్తం మర్చిపోయింది. తను ప్రసవానంతరం డబ్బులతో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ఆమె ఆ బాధను మొత్తం మర్చిపోయిందని.. తన బిడ్డకు వెచ్చని సాంగత్యాన్ని అందించిందని” సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లు వెత్తుతున్నాయి.