Cotton Candy: పీచు మిఠాయి.. జాతరలు, సంతల్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. దానిని చూడగానే పిల్లల నుంచి పెద్దల వరకు నోరూరుతుంది. ఇప్పటికే అందరం చాలాసార్లు తిని ఉంటాం. కానీ, మనకు తెలియకుండానే మనం విషం తినేశాం. నమ్మలేకపోతున్నారా.. కానీ ఇది నిజం. పీచు మిఠాయి చాలా డేంజర్ అని ఇటీవల పరిశోధనల్లో నిర్ధారణ అయింది. ఇందులో ప్రమాదకరమైన రసాయనం కలుపడంతో అది క్యాన్సర్ కారకంగా మారుతుందని పరిశోధనల్లో గుర్తించారు. దీనిని తినడం ద్వారా క్యాన్సర్‌ను కొని తెచ్చుకున్నట్లే అని పేర్కొంటున్నారు.
మేడారం జాతరలో..
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో పీచు మిఠాయి తయారు చేసి విక్రయిస్తున్న బండిపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అధికారులు దాడిచేసి సీజ్ చేశారు. అందులో ప్రమాదకరమైన రసాయనం ఉన్నందున విక్రయాలు నిలిపివేశారు. ఎవరూ తినవద్దని అక్కడ ప్రచారం చేశారు.
ఆ రాష్ట్రాలో బ్యాన్..
క్యాన్సర్ కారక రసాయనం, వివిధ ఆర్గాన్లను డ్యామేజ్ చేసే కెమికల్ కాంపౌండ్ ఉన్న కారణంగా పీచు మిఠాయిని తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే నిషేధించాయి. వీటిన తయారీ, విక్రయాలు జరిపితే కఠిన ^è ర్యలు తీసుకుంటామని ఆయా రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా దీనిని నిషేధించారు.
ఏ కెమికల్ ఉందో తెలుసా ?
పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు తమిళనాడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల చెన్నై నగర వ్యాప్తంగా తనిఖీలు చేశారు. అప్పుడు కొన్ని శాంపిళ్లు సేకరించి అధ్యయనం చేశారు. ఈ పీచుమిఠాయిలో రోడమైన్ – బి అనే కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. పీచు మిఠాయి తయారీ సందర్భంగా ఉపయోగించే రంగులో ఈ రసాయనం ఉన్నట్లు నిర్ధారించారు. ఈ రోడమైన్– బిని ఇండస్ట్రీయల్‌డైగా పిలుస్తారు. దుస్తుల కలరింగ్, పేపర్ ప్రింటింగ్‌లో వాడుతారు. ఫుడ్ కలర్‌గా దీనిని వాడకూడదు. కానీ పీచుమిఠాయి తయారీదారులు ఆకర్షణీయమైన రంగుల కోసం కెమికల్ వాడుతున్నారు. ఇదే ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు. ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే కిడ్నీలు, లివర్‌పైనా ప్రభావం ఉంటుందని తెలిపారు. అల్సర్, క్యాన్సర్‌కు దారి తీస్తుందని వెల్లడించారు.
1897 నుంచే పీచు మిఠాయి..
ఇక పీచు మిఠాయిని అమెరికాకు చెందిన దంతవైద్యుడు విలియం మారిసన్ కనిపెట్టాడు. మిఠాయి వ్యాపారి జాన్ సీ వార్టన్‌తో కలిసి 1897లో దీనిని తయారు చేశారు. మొదట ఫెయిరీ ఫ్లాస్ అనే పేరుతో పిలిచేవారని తమిళనాడుకు చెందిన చెఫ్, ఆహార చరిత్రకారుడు రాకేశ్ రఘునాథన్ తెలిపారు. అయితే పీచు మిఠాయి అప్పుడే పండించిన పత్తిలా తెల్లగా కనిపించడంతో కాలక్రమేణా దానిని కాటన్ క్యాండీగా పిలవడం ప్రారంభించారని పేర్కొన్నారు. తొలినాళ్లలో ఈ కాటన్ క్యాండీ క్లోరోఫిల్(ఆకుపచ్చ), కెరోటినాయిడ్(పసుపు, నారింజ లేదా ఎరుపు), ఆంథోసైనిన్(నీలం) వంటి రంగుల్లో ఉండేది.