
Dasara Movie Twist: న్యాచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రం ‘దసరా’.శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ చిత్రం మరో మూడు రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి నాని చెప్పిన మాటలు వింటే కచ్చితంగా ఆయన ఈసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టబోతున్నాడు అనేది అర్థం అవుతుంది.
అందుకు తగ్గట్టుగానే ప్రమోషనల్ కంటెంట్ కూడా ఉంది.ఇప్పటి వరకు విడుదలైన పాటలు , టీజర్ మరియు ట్రైలర్ ఆడియన్స్ మైండ్ ని బ్లాక్ చేసాయి. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ హీరో సినిమాకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉన్నాయి. చూస్తూ ఉంటే నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టే సినిమాగా నిలుస్తాదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఓవర్సీస్ లో ఈ చిత్రం మొదటి రోజు 1 మిలియన్ మార్కుని అందుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.

ఇక ఈ సినిమాకి ప్రొమోషన్స్ లో భాగంగా నిన్న అనంతపూర్ లో ఒక ‘దసరా ధూమ్ ధామ్’ అనే ఈవెంట్ ని ఏర్పాటు చేసారు.ఈ ఈవెంట్ కి ఫ్యాన్స్ నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం గురించి నాని మాట్లాడుతూ ‘నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఈ సినిమాకోసం పని చేసిన 12 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ రాబొయ్యే రోజుల్లో పెద్ద స్టార్ డైరెక్టర్స్ గా మారిపోతారు. నిర్మాతలు వీళ్లకు అడ్వాన్స్ చెక్కులు ఇచ్చి లాక్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ వీళ్ళు దొరకరు. ఇక శ్రీకాంత్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఈ సినిమా తర్వాత అందరూ అతను ఎంత గొప్ప డైరెక్టర్ అనేది అర్థం చేసుకుంటారు. ఈ చిత్రం కోసం సుమారుగా ఏడాది నుండి దుమ్ము, బొగ్గుల మధ్యనే ఉన్నాము. ఎన్నో కష్టాలను అనుభవించాము, ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని మరో మూడు రోజుల్లో చూడబోతున్నాము. ఈ సినిమా లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి..ముఖ్యంగా క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ మైండ్ లో బ్లాస్ట్ చేసే విధంగా ఉంటుంది’ అంటూ నాని ఈ సందర్భంగా మాట్లాడాడు.