Kaikala Satyanarayana Death Reason: తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో విలువైన సంపదని కోల్పోయింది..నవరస నటనతో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించి సుమారు 770 కి పైగా సినిమాల్లో నటించిన మహానటుడు కైకాల సత్యనారాయణ నేడు ఉదయం నాలుగు గంటల సమయం లో తిరిగిరాని లోకాలకు ప్రయాణమయ్యాడు..ఆయన మరణ వార్త విని యావత్తు సినీ లోకం శోకసంద్రం లో మునిగిపోయింది..అలనాటి మహానటులలో భౌతికంగా మన మధ్య ఉన్న ఏకైక వ్యక్తి కైకాల సత్యనారాయణ అని చెప్పుకునేవాళ్ళం..ఇప్పుడు ఆయన కూడా మనల్ని వదిలి వెళ్లిపోవడం సినీ పరిశ్రమకి తీరని లోటు.

తన 87 ఏళ్ళ జీవిత కాలం లో 65 ఏళ్ళు ఆయన సినిమాకే అంకితం చేసాడు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో అన్ని రకాల పాత్రలు పోషించిన ఏకైక నటుడు ఆయనే..పౌరాణిక పాత్రల దగ్గర నుండి, సాంఘీకం , గ్రాంధీకం అని తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు పోషించిన మహానటుడు ఆయన..రావణాసురుడు ,దుర్యోధనుడు, భీముడు , అర్జునుడు , మూషికాసురుడు, కీచకుడు, ఘటోత్కచుడు మరియు యముడు ఇలా ఒక్కటా రెండా ఆయన పోషించని పాత్రలు ఏమి మిగిలి ఉన్నాయో లెక్కపెట్టుకోవాలి.
ముఖ్యంగా యముడు అంటే ఇలాగే ఉండాలి..ఇలాగే మాట్లాడాలి అని తరతరాలు గుర్తుండిపోయేలా కైకాల సత్యనారాయణ నటించిన తీరు అద్భుతం..ఇప్పటికి యముడు అంటే ఆయన మాత్రమే గుర్తుకువస్తాడు..మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోలేము కూడా..ఇక వ్యక్తిగతంగా కూడా కైకాల సత్యనారాయణ ఎంతో ఉన్నతమైన మనిషి..చాలా ఆరోగ్యం గా కూడా ఉండేవారు..అయితే ఆయన చనిపోవడానికి ప్రధాన కారణం వయోభారం..గత కొంతకాలం నుండి ఆయన ఈ అనారోగ్య సమస్య తో బాధపడుతున్నారు..కరోనా వచ్చినప్పటి నుండి ఆయన ఎక్కువ సమయం హాస్పిటల్ లోనే గడిపారు..ఆరు నెలల నుండి ఇంట్లోనే శస్త్ర చికిత్స చేయించుకుంటున్నాడు..కైకాల సత్యనారాయణ చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన మహర్షి.

ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే కి తాతయ్య పాత్రలో నటించాడు..అప్పటి వరకు ఆయన పైకి లేచి ఆరోగ్యం గా నడిచే స్థాయిలోనే ఉండేవాడు..ఆ తర్వాత నుండే ఆరోగ్య సమస్యలు తలెత్తాయి..ఇక అప్పటి నుండి సినిమాలు చెయ్యడం మానేసాడు..మధ్యలో ఒకసారి ఆరోగ్యం చాలా క్రిటికల్ పొజిషన్ కి వచ్చింది..కానీ మళ్ళీ ఆరోగ్యం కుదుట పడింది..ఇప్పుడు మన తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టం కొద్దీ ఆయన కన్నుమూశాడు..ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా మన అందరం ఆ దేవుడికి ప్రార్థన చేద్దాం.