
Tarakaratna- NTR: నందమూరి తారకరత్న చనిపోయిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నందమయూరి అభిమానులను మరియు యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే.చాలా చిన్న వయస్సులోనే ఆయన తన ప్రాణాలను కోల్పోవడం అనేది శోచనీయం.ప్రతీ ఒక్కరితో మంచిగా ఉంటూ, ఎంతో ప్రేమగా పలకరించే తారకరత్న ఇక లేడు అనే విషయాన్నే జీర్ణించుకోవడం కష్టం అవుతుంది.రీసెంట్ గానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తారకరత్న, తెలుగుదేశం పార్టీ లో గుడివాడ ప్రాంతం నుండి పోటీ చెయ్యాలి అనుకున్నాడు.
గత కొద్దీ రోజుల నుండి ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నాడు, ఆలా సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న తారకరత్న కి ఇలా జరగడం నందమూరి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఈ బాధ నుండి వాళ్ళు ఎప్పుడు కోలుకుంటారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.ఇది ఇలా ఉండగా తారకరత్న తన చివరి కోరిక గురించి జూనియర్ ఎన్టీఆర్ తో చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాను అంటూ అధికారిక ప్రకటన చేసిన వెంటనే తారకరత్నకు శుభాకాంక్షలు తెలియచేసిన మొట్టమొదటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్.నువ్వు చాలా మంచోడివి, ప్రజలకు ఎదో చెయ్యాలనే తాపత్రయం ఉన్నోడివి, కచ్చితంగా నువ్వు రాజకీయాల్లో రాణించగలవు, ఆల్ ది బెస్ట్ అంటూ తారకరత్న కి ఎన్టీఆర్ చెప్పాడట.అప్పుడు తారకరత్న ఎన్టీఆర్ తో మాట్లాడుతూ ‘నువ్వు కూడా రాజకీయాల్లోకి రావాలి తమ్ముడు.తెలుగు దేశం పార్టీ నీకోసం ఎదురు చూస్తుంది, కోట్లాది మంది అభిమానుల కోరుకున్నట్లు గానే నేను కూడా నువ్వు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను.ముఖ్యమంత్రి సీట్ లో నిన్ను చూడాలి అనేది నాకోరిక’ అంటూ చెప్పుకొచ్చాడట తారకరత్న.

ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అంతే కాకుండా బాలయ్య బాబు తో కూడా కలిసి ఒక సినిమాలో చెయ్యాలని తారకరత్న ఎప్పటి నుండో కోరుకుంటున్నాడు.త్వరలో అనిల్ రావిపూడి తో బాలయ్య చెయ్యబోతున్న సినిమాలో కూడా తారకరత్న కి మంచి రోల్ వచ్చిందట.ఈలోపే ఇలా జరగడం దురదృష్టకరం.