20 Crore Dog: ఓ కుక్క రూ.20 కోట్ల ధర పలికిందంటే మాటలు కాదు. మనుషులకే అంతటి విలువ లేకున్నా జంతువులకు భారీ మొత్తంలో ఖరీదు కట్టడం సంచలనం కలిగిస్తోంది. శునకానికి ఇంత ధర చెల్లించడం ఇదే ప్రథమం. కుక్కకు విశ్వాసం ఎక్కువ. నక్కకు తెలివి ఎక్కువ అంటారు. విశ్వాసంలో కుక్కను మించిన జంతువు లేదు. అందుకే దానికి అంతటి ప్రాధాన్యం ఇస్తారు. ఇంటికి కాపలా ఉండే కుక్క ఇంటికి ఎవరైనా వస్తే అరుస్తుంది. దీంతో ఇంట్లోని వారు అప్రమత్తమై ఎవరైనా వచ్చారా అని చూస్తారు. ఇంటిని సంరక్షించే కుక్కకు తిండి పెడితే చాలు యజమానికి జీవితాంతం సేవలు చేసేందుకు వెనకాడదు. ఈ నేపథ్యంలో కుక్కల పెంపకం ఇటీవల కాలంలో పెరిగిపోతోంది.

ఎవరు చూసినా తమ ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం సర్వసాధారణంగా మారింది. దీంతో కుక్కను కొనేందుకు అందరు మొగ్గు చూపుతున్నారు. కుక్కను పెంచుకుంటే అదో సోషల్ స్టేటస్ గా కూడా చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుక్కను పెంచుకుంటున్నారు. తాజాగా బెంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి కాకేసియన్ షెపర్డ్ అనే కుక్కను కొనుగోలు చేశాడు. ఎంతకో తెలుసా ఏకంగా రూ. 20 కోట్లు చెల్లించి సొంతం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కుక్కకు అంతటి ధర ఏంటి అనుకుంటున్నారా? అదే దాని స్పెషల్.
హైదరాబాద్ లోని పెంపకం దారుడి నుంచి 1.5 ఏళ్ల వయసున్న కాకేసియన్ షెపర్డ్ కుక్కను కొనుగోలు చేశాడు. దానికి కాడ్ బామ్ హైదర్ అనే పేరు కూడా పెట్టాడు. ఇది మామూలు కుక్క కాదు. వాచ్ డాగ్ గా దీన్ని ఉపయోగిస్తారు. మనిషి చేయలేని చాలా పనులు కుక్కలు చేస్తాయి. నేరస్తులను కనిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దొంగతనం జరిగితే వాసన పసిగట్టి వారిని పట్టుకోవడంలో కూడా సహకరిస్తాయి. అందుకే కుక్కలను పోలీస్ శాఖ ప్రత్యేకంగా పెంచి వాటితో పలు పనులు చేసుకుంటుంది.

ఇలా కుక్కలు మనిషి జీవితంలో ఎన్నో పనుల్లో సాయపడతాయి. ఎంత పెద్ద కుక్క ఉంటే అంత విలువగా చూస్తారు. ప్రతి ఒక్కరు కుక్కలను పెంచుకుని తమ దర్జా ప్రదర్శిస్తుంటారు. ఇలా కుక్కలను పెంచుకోవడం ఇటీవల ఫ్యాషన్ గా మారిపోయింది. ఇక్కడ మాత్రం కుక్క ధర ఏకంగా కోట్లు పలకడం గమనార్హం. కుక్క ఖరీదు రూ.20 కోట్లు అంటే మాటలు కాదు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. శునకానికి అంత రేటా అని అందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.