Akkineni Nagarjuna- Mrunal Thakur: సీనియర్ హీరోలందరూ ఇప్పుడు వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకుపోతున్నారు..ఒక్క అక్కినేని నాగార్జున తప్ప..ఈమధ్య కాలం లో ఈయన ముట్టుకున్న ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి..గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమాతో హిట్ కొట్టాడు..కానీ అందులో నాగార్జున కంటే నాగ చైతన్య కి ఎక్కువ పాత్ర ఉండడం తో అతనికే ఎక్కువ క్రెడిట్ దక్కింది..మరి సోలో హీరోగా నాగార్జున హిట్ కొట్టేది ఎప్పుడూ అంటూ అభిమానులు నిరాశకి గురయ్యారు.

అయితే నాగార్జున ఈసారి సినిమా తీస్తే భారీ హిట్ అయ్యే రేంజ్ సబ్జెక్టు ని తీశానని..’ఘోస్ట్’ లాంటి ప్రయోగాలకు ఇక ఆయన గుడ్ బై చెప్పేసినట్టే అని అంటున్నారు విశ్లేషకులు..ప్రస్తుతం ఆయన ఒక మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేందుకు ఎదురు చూస్తున్నారు..ఇటీవల కాలం లో మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన ‘ధమాకా’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
అయితే ఆ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే ప్రసన్న కుమార్ అందించాడు..అతని పనితనం నాగార్జున కి ఎంతగానో నచ్చింది..దీనితో వెంటనే అతనిని పిలిచి తన సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ని కల్పించాడు నాగార్జున..ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది..నాగార్జున కి ఇలా టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడం ఇదేమి కొత్త కాదు..అలా ఆయన ఇండస్ట్రీ కి ఎంతో మంది డైరెక్టర్స్ ని పరిచయం చేసాడు..వాళ్ళ మీద నాగార్జున పెట్టుకున్న నమ్మకం ని నిలుపుకున్నారు.

ఇప్పుడు ప్రసన్న కుమార్ కూడా నాగార్జున కి కావాల్సిన అత్యవసర బ్లాక్ బస్టర్ ని కచ్చితంగా ఇస్తాడని అభిమానులు నమ్ముతున్నారు..అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సీతారామం ఫేమ్ ‘మృణాల్ ఠాకూర్’ నటించబోతున్నట్టు సమాచారం..దీనిపై అక్కినేని ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి తో ఉన్నారు..మృణాల్ ఠాకూర్ లాంటి యంగ్ హీరోయిన్ ఎందుకు, తన వయస్సు కి తగ్గ హీరోయిన్స్ తో చేస్తే బాగుంటుంది కదా అని అభిమానులు సోషల్ మీడియా లో నాగార్జున ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు..దీనిపై నాగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.