
Sreeleela: టాలీవుడ్ లో ఎప్పుడు కుర్ర హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు శ్రీలీల జపం చేస్తున్న సంగతి తెలిసిందే.నితిన్ , రామ్ లాంటి హీరోలకు శ్రీలీల కావాలి, పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు లాంటి హీరోలకు కూడా శ్రీలీలనే కావాలి.అలా ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ల అవకాశాలకు గండికొట్టి టాప్ స్టార్ గా ఎదిగిపోయింది.
అందం మరియు అభినయం తో పాటు అద్భుతమైన డ్యాన్స్ శ్రీలీల సొంతం , కేవలం ఆమె కోసమే థియేటర్స్ కి కదిలిన జనాలు సంఖ్య లక్షల్లోనే ఉంటుంది.అందుకే శ్రీలీల కోసం టాలీవుడ్ మొత్తం అలా క్యూ కట్టేస్తుంది.ప్రస్తుతం ఆమె చేతిలో పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు సినిమాలతో పాటుగా నవీన్ పోలిశెట్టి, పంజా వైష్ణవ్ తేజ్, నితిన్ , రామ్ వంటి హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.
ఇంత మంది హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాలు సంపాదిస్తున్న శ్రీలీల కు టాలీవుడ్ లో ఇష్టమైన హీరో ఎవరు అంటే ఆమె చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.తెలుగు లో నాకు అందరూ హీరోలు ఇష్టమేనని, అందరు ఎంతో అద్భుతంగా నటిస్తారని చెప్పుకొచ్చింది.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే తెగ ఇష్టం, కాబట్టి మామూలు హీరోలకంటే డ్యాన్స్ వేసే హీరోలు కాస్త ఎక్కువ ఇష్టం, ఆ విధంగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరోలు’ అంటూ శ్రీలీల ఈ సందర్భం గా మాట్లాడింది.ఇప్పిడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ కాబట్టి, అవకాశాల కోసం చాలా డిప్లొమాటిక్ గా శ్రీలీల సమాధానం చెప్పిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.