
ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు విజృంభించిన వ్యాధులతో పోలిస్తే కరోనా ప్రత్యేకం. శాస్త్రవేత్తలు, పరిశోధకులు కరోనా వైరస్ విజృంభించిన స్థాయిలో గతంలో ఏ వ్యాధి విజృంభించలేదని.. ఒక దేశం నుంచి మరో దేశానికి ఇంత వేగంగా వ్యాప్తి చెందిన వైరస్ లు, బ్యాక్టీరియాలు గతంలో లేవని చెబుతున్నారు. గబ్బిలం లేదా అలుగు నుంచి ఈ వైరస్ బయటపడి ఉండవచ్చని కొందరు శాస్త్రవేత్తలు చెబుతుండగా మరి కొందరు మాత్రం చైనాలోని వుహాన్ ల్యాబ్ లో ఈ వైరస్ ను సృష్టించారని చెబుతున్నారు.
Also Read : కమలానికి దూరంగా ‘చేతి’కి గులాబీలు!
విచిత్రం ఏమిటంటే చైనా నుంచి వ్యాప్తి చెందిన ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు గజగజా వణుకుతుంటే చైనాలో మాత్రం వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలోని అన్ని రంగాలపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుండగా వైరస్ ప్రభావం ఎలక్షన్స్ పై కూడా పడ్డాయి. ఏపీలో కొన్ని నెలల క్రితమే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆ ఎన్నికలు వివిధ కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.
మరికొన్ని నెలల్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటివరకు ఈవీఎంలలో ఎన్నికలు జరగగా బ్యాలెట్ విధానం లేదా మరో కొత్త విధానంలో ఎన్నికలు జరపాలని ప్రజల నుంచి తీవ్రస్థాయిలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో అనేక పార్టీలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించవద్దని కోర్టు మెట్లెక్కగా ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆయా పార్టీల కల నెరవేరే విధంగానే ఉంది.
ఈవీఎంలలో ఓట్లు వేస్తే కరోనా సోకిన ఒక్కరు ఓటు వేసినా చాలామందికి వైరస్ సోకే అవకాశం ఉండటంతో ఈవీఎంల వైపు పార్టీలు కూడా మొగ్గు చూపే అవకాశాలు తక్కువ. తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు బ్యాలెట్ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయి. భవిష్యత్తులో కరోనా ఓటు వేసే విధానాన్ని పూర్తిగా మార్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరరం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Also Read : జగన్ కేసీఆర్ మధ్య యుద్ధం మొదలైనట్లేనా..?
Comments are closed.