
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. రైతుల కోసం జగన్ సర్కార్ ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తోంది. తాజాగా జగన్ సర్కార్ మరో కొత్త పథకం అమలుకు సిద్ధమవుతోంది. ‘వైఎస్సార్ జలకళ’ పేరుతో జగన్ సర్కార్ ఈ నెల 28వ తేదీ నుంచి మరో కొత్త పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలగనుంది.
Also Read : జగన్ కేసీఆర్ మధ్య యుద్ధం మొదలైనట్లేనా..?
రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి రాక ముందు రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 16 నెలల తరువాత కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నా జగన్ మాత్రం రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ పథకానికి అర్హులైన రైతులు ఆన్ లైన్ ద్వారా లేదా గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
సమాచార కమిషనర్ విజయ్‌కుమార్ రెడ్డి కొత్త పథకం గురించి మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల్లో జియోఫిజికల్, హైడ్రలాజికల్ సర్వేల ద్వారా బోర్ల తవ్వకం జరుగుతుందని… పూర్తిస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి రైతుల ఎంపిక ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. కాంట్రాక్టర్ల ద్వారా బోర్ల తవ్వింపు జరుగుతుందని.. పని పూర్తైన తర్వాత మాత్రమే డబ్బు చెల్లింపులు జరుపుతామని అన్నారు.
ఆన్‌లైన్ ద్వారా సచివాలయం నుంచి జగన్ ఈ నెల 28వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ పనితీరును మెచ్చుకుంటున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల చాలా పార్టీలు ఉన్న సంక్షేమ పథకాలనే అమలు చేయలేక కోతలు విధిస్తుంటే జగన్ సర్కార్ కొత్త పథకాలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.
Also Read : బీజేపీ షాక్ తో వెనక్కు తగ్గిన జగన్ సర్కార్..?