RRR- Pushpa:’పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే’ అని పెద్దలు చెప్పే మాటకి రీసెంట్ ఉదాహరణగా నిలిచింది అల్లు అర్జున్ పుష్ప చిత్రం..అసలు విషయానికి వస్తే #RRR మూవీ ఓటీటీ లో విడుదలైన తర్వాత ఇతర దేశాల్లో ఉన్న ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..దానిని కరెక్ట్ గా క్యాష్ చేసుకుంటూ రాజమౌళి ఈ సినిమాని ఫారిన్ భాషలలో విడుదల చెయ్యాలని సంకల్పించాడు..అందులో భాగంగా తొలుత ఈ సినిమాని జపాన్ భాషలోకి డబ్ చేసి విడుదల చేసారు.

విడుదలకి ముందు #RRR మూవీ టీం జపాన్ మీడియా తో అక్కడి అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి ప్రొమోషన్స్ బాగా చేసారు..అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి..ఫలితంగా సినిమా అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇప్పటి వరుకు 400 జపనీస్ మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టి ఆల్ టైం హిట్ గా నిలిచింది..ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ జోరు ఇంకా తగ్గలేదు.
#RRR మూవీ లాగానే పుష్ప సినిమా రష్యా లో పెద్ద హిట్ అవుతుందని బలంగా నమ్మింది ఆ మూవీ టీం..ఎందుకంటే ఈ సినిమాని ‘మాస్కో ఫిలిం ఫెస్టివల్’ లో రష్యన్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శించారు..ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన సినిమా కావడం తో ఈ మూవీ ని రష్యా లో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ఆ మూవీ టీం కి వచ్చింది..వెంటనే రష్యన్ భాషలోకి మూవీ ని డబ్ చేసి ఆ దేశం లోని 24 ప్రాంతాలలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేసారు..విడుదలకు ముందు మూవీ టీం మొత్తం రష్యా లో ప్రొమోషన్స్ కోసం బయలుదేరింది..ఇందుకోసం సుమారుగా ఆరు కోట్ల రూపాయిలు ఖర్చు చేసారు..డిసెంబర్ 1 వ తేదీన మాస్కో లో మరియు డిసెంబర్ 3వ తేదీన పీటర్స్ బర్గ్ లో మూవీ టీం మొత్తం ప్రొమోషన్స్ కోసం తెగ హల్చల్ చేసారు.

కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు మొత్తం వృధా అయ్యింది..రష్యా లో ఈ సినిమాని ప్రేక్షకులు కనీస స్థాయిలో కూడా ఆదరించలేదు..ప్రొమోషన్స్ కోసం ఖర్చు చేసిన ఆరు కోట్ల రూపాయలలో పావు శాతం వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా..ఇండియన్ మూవీస్ కి అసలు మార్కెట్ లేని రష్యా వంటి దేశం లో విడుదల చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చిందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.