iron leg shasti personal life unknown struggles: కమెడియన్ కు కొత్త సొబుగులు అందిన కమెడియన్ ఎవరంటే ఠక్కున సమాధానం వచ్చే పేరు ‘ఐరెన్ లెగ్’ శాస్తి. ఆ పేరు ఐరెన్ లెగ్ అని ఏ ముహూర్తానా పెట్టారో కానీ అతడికి సినిమాలు తక్కువ. వ్యక్తిగత జీవితంలో కష్టాలు ఎక్కువగా వచ్చాయట..

అప్పట్లో రాజబాబు, పద్మనాభం తర్వాత బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ లు కమెడియన్లుగా వెలుగు వెలిగారు. అయితే ఆ తర్వాత ఐరన్ లెగ్ శాస్త్రి కూడా మధ్యలో ఇలా వచ్చి టాలీవుడ్ లో చెరగని ముద్ర వేశారు. తన పెద్ద శరీరం.. ఐరెన్ లెగ్ పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అసలు ఐరన్ లెగ్ శాస్తి ఎవరు అతడి జీవిత విశేషాలు గురించి తెలుసుకుందాం..
ఐరెన్ లెగ్ శాస్త్రి కామెడీ అందరితో పోలిస్తే వేరుగా ఉంటుంది. ఆయన ఉన్నన్నీ రోజులు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించారు. ఆయన కామెడీ సన్నివేశాలు ఇప్పటి ప్రేక్షకులను సైతం అలరించాయి. అతడి పేరు ‘ఐరెన్ లెగ్ శాస్త్రి’గా ముద్రపడింది.
నిజానికి ఐరెన్ లెగ్ శాస్త్రి అసలు పేరు ‘గునుపూడి విశ్వనాథ శాస్తి. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన అప్పుల అప్పారావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఐరెన్ లెగ్ శాస్తి దాదాపు 150 సినిమాల్లో నటించి తనకంటూ పేరు సంపాదించుకున్నాడు.
బ్రహ్మానందం, ఐరెన్ లెగ్ శాస్త్రి కాంబో వెండితెరపై కనిపించగానే ఇప్పటికీ ప్రేక్షకులు కడుపుబ్బా నవ్విస్తాయి. వాళ్ల జోడి ఎంత హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు. బాబు మోహన్-కోట శ్రీనివాసరావు గారి జోడి తర్వాత అంతటి పేరు పొంది జోడి ఎవరిదంటే అది ముమ్మాటికీ బ్రహ్మానందం-ఐరెన్ లెగ్ శాస్త్రి జోడీనే.
పశ్చిమ గోదావరికి చెందిన ఐరెన్ లెగ్ శాస్త్రి సినిమాల్లోకి రాకముందు పురోహితుడిగా పనిచేశారు. ఓ శుభకార్యంలో ఐరెన్ లెగ్ శాస్త్రిని చూసిన ఈవీవీ సత్యనారాయణ తన హాస్య చతురతను గమనించి ‘అప్పుల అప్పారావు’ మూవీలో ఐరెన్ లెగ్ శాస్త్రిగా ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా వెండితెరకు పరిచయం అయ్యారు. దాంతో అతడి పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది.
అయితే ఆ తర్వాత అనారోగ్య సమస్యలు రావడంతో సినిమాలకు దూరం అయ్యారు. కుటుంబ భారం అంతా తనపై పడి ఆర్థిక సమస్యలు వెంటాడాయి. సినిమా అవకాశాలు కూడా తగ్గడంతో హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళ్లిపోయారు. మళ్లీ పురోహిత్యం స్ట్రాట్ చేయగా.. ‘ఐరెన్ లెగ్’ అనే పేరు పడడంతో ఎవరూ శుభకార్యాలకు పిలిచేవారు. దీంతో కుటుంబం దీన స్థితిలోకి జారిపోయింది.
కొందరు సినీ ప్రముఖులు అతడికి ఆర్థికసాయం కూడా చేశారు. కానీ ఆ డబ్బులకు అతడి జీవితం మెరుగుపడలేదు. అతడి ఆరోగ్యం మరింత క్షీణించి చివరకు 2006 జూన్ 19న ఐరన్ లెగ్ శాస్త్రి తుదిశ్వాస విడిచాడు. మరణించిన అతడి భౌతిక కాయాన్ని అంబులెన్స్ లో కాకుండా ఒకరిక్షాలో నాడు ఈడ్చుకు వెళ్లారని..అతడి భార్య కన్నీరుమున్నీరైంది. చివరి రోజుల్లో అతడు దుర్భర జీవితాన్ని అనుభవించాడని చెబుతారు.