Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. పుష్ప మూవీలో దాక్షాయణిగా నటించి అదరగొట్టిన అనసూయ.. మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీ ఆచార్యలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే మెగాస్టార్ మరో మూవీలోనూ నటించే ఛాన్స్ కొట్టేసిందని సమాచారం. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ మూవీలో అనసూయ ఓ డిఫరెంట్ రోల్ చేస్తోందని తెలుస్తోంది. త్వరలోనే అనసూయ షూటింగ్‌లో జాయిన్ అవబోతోందట.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రిన్స్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమాలో మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ పవర్ ఫుల్ రాజకీయ పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుండగా.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తోంది. 11 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి.
Also Read: విరాట్ కోహ్లీ ఫాం కోల్పోవడంపై రోహిత్ శర్మ హాట్ కామెంట్స్

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై బాలకృష్ణ తొలిసారి స్పందించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య, సినిమా టికెట్ రేట్ల విషయంలో జగన్‌తో మాట్లాడటానికి తనని పిలిచారని, కానీ తాను రానని చెప్పినట్లు తెలిపారు.

‘నేను సినిమా బడ్జెట్ పెంచను, టికెట్ రేట్లు తక్కువున్నప్పుడే ‘అఖండ’ విజయం సాధించింది. ఇక టికెట్ రేట్లను పెంచమని జగన్ వద్దకు ఎందుకు వెళ్లాలి’, అని అన్నారు.
Also Read: ఏకంగా ప్రభాస్ కే హీరోయిన్ గా నటిస్తోందా ?