IPL 2025: సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఐపీఎల్ నిర్వాహక కమిటీ క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ ఆగదని.. ఐపీఎల్ నిలిపివేయాలని ఇంతవరకు తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని నిర్వాహక కమిటీ స్పష్టం చేసింది.. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలలోని మైదానాలలో జరగాల్సిన మ్యాచ్లను ఇతర ప్రాంతాలలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంతవరకు ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పాకిస్తాన్ సరిహద్దులో పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో నిర్వహించే మ్యాచ్లను ఇతర ప్రాంతాలలో జరపాలని నిర్ణయించారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు పాకిస్తాన్ దేశంపై భారత దాడులు మొదలుపెట్టిన నేపథ్యంలో.. సరిహద్దుల్లో భద్రతను కట్టు దిట్టం చేశారు. అంతేకాదు మ్యాచ్ లు జరుగుతున్న మైదానాలలో భారీగా పోలీసులను మోహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న ప్రాంతాలలో భారీగా ప్రేక్షకులు వస్తుంటారు. ఈ క్రమంలో భద్రత పరంగా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా నష్టం భారీగా ఉంటుంది కాబట్టి.. ముందస్తు జాగ్రత్తగా ఐపిఎల్ నిర్వహణ కమిటీ.. స్థానిక పోలీసుల సహాయంతో భద్రతను కట్టుదిట్టం చేయనుంది.
Also Read: సచిన్ కూతురు డేటింగ్ చేస్తోంది గిల్ తో కాదా? హమ్మయ్యా ఇన్నాళ్లకు క్లారిటీ!
56 మ్యాచులు పూర్తి
ఇక ఇప్పటివరకు ఐపీఎల్లో 56 మ్యాచులు పూర్తయ్యాయి. ఐపీఎల్ లో దాదాపు గ్రూప్ దశ ముగింపునకు వచ్చేసింది. ఇప్పటికే మూడు జట్లు ఇంటిదారి పట్టాయి. మిగతా నాలుగు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ జట్టు ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఒక రకంగా ప్లే ఆఫ్ కు ఆ జట్టు వెళ్లినట్టే. మంగళవారం నాడు తీవ్రమైన ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో ఓడిపోయి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరోవైపు బుధవారం చెన్నై, రహానే సేన మధ్య మధ్య మ్యాచ్ జరుగుతున్నది.. ఇప్పటికే చెన్నై ఇంటిదారి పట్టింది.. ప్లే ఆఫ్ వెళ్లాలంటే రహనే సేన ఇందులో కచ్చితంగా విజయం సాధించి తీరాలి.. ఇక పాయింట్లు పట్టికలో కోల్ కతా ఆరవ స్థానంలో ఉంది.. ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దానివల్ల ఆ జట్టుకు పెద్దగా నెట్ రన్ రేట్ పెరగలేదు. అయితే చెన్నైతో జరిగే మ్యాచ్లో భారీ తేడాతో గెలిచి.. నెట్ రన్ రేట్ పెంచుకోవాలని కోల్ కతా జట్టు భావిస్తోంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Also Read: రోహిత్ 7, రికెల్టన్ 2.. ముంబైకి ఏ మంత్రవేశావయ్య గిల్..