Homeక్రీడలుSRH Vs MI: ముంబై తో హైదరాబాద్ మ్యాచ్.. రూ.8.25 కోట్ల ఆటగాడిపై వేటు

SRH Vs MI: ముంబై తో హైదరాబాద్ మ్యాచ్.. రూ.8.25 కోట్ల ఆటగాడిపై వేటు

SRH Vs MI
SRH Vs MI

SRH Vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో హైదరాబాద్ జట్టు గాడిలో పడింది. వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. మంగళవారం మరో కీలక పోరుకు ఈ జట్టు సిద్ధమవుతోంది. ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో ఈ జట్టు అమీ తుమీ తేల్చుకోబోతోంది. ఈ సీజన్లో రెండు వరస ఓటములతో ప్రారంభించిన హైదరాబాద్ జట్టు.. వెంటనే గాడిలో పడి వరుసగా పంజాబ్, కేకేఆర్ జట్లను మట్టికరిపించింది. మరో ముఖ్యమైన పోరుకు మంగళవారం ఈ జట్టు సిద్ధమవుతోంది.

ఐపీఎల్ తాజా సీజన్ లో హైదరాబాద్ జట్టు గాడిన పడినట్టు కనిపిస్తోంది. కీలక ప్లేయర్ లు ఫామ్ లోకి రావడంతో ప్రస్తుతం ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. అత్యధిక మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ ఫామ్ లోకి రావడంతో ఆ జట్టు ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ జట్టు మాదిరిగానే తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన ముంబై జట్టు.. చివరి రెండు మ్యాచ్ ల్లో పుంజుకొని అద్భుత విజయాలను నమోదు చేసుకుంది. దీంతో మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. మంగళవారం జరిగే పోరు హోరా, హోరీగా సాగుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఫీల్డింగ్ లోపలు సరిదిద్దుకోవాల్సిన అవసరం..

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక ఆటగాళ్లు ఫామ్ లోకి రావడంతో కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. అయితే, ఈ జట్టు చెత్త ఫీల్డింగ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. కేకేఆర్ తో మ్యాచ్ లో దారుణమైన ఫీల్డింగ్ చేసిన హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు.. మొత్తంగా ఐదు క్యాచ్ లను నేలపాలు చేశారు. ముంబై జట్టు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో ఫీల్డింగ్ లో లోపాలు సరి చేసుకోకపోతే ఘోర పరాభవాన్ని మూట కొట్టుకోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రెచ్చిపోగల సామర్థ్యం ముంబై బ్యాటర్ల సొంతం. కాబట్టి ఫీల్డింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా హైదరాబాద్ జట్టు ఉండాల్సిన అవసరం ఉంది.

కలవర పెడుతున్న మాయాంక్ అగర్వాల్ ఫామ్..

ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఫామ్ కూడా జట్టును కలవరపెడుతోంది. నాలుగు ఇన్నింగ్స్ ల్లో కలిపి మయాంకు 30 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతనిపై వేటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. రూ.8.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన అగర్వాల్ కు టీమ్ మేనేజ్మెంట్ అండగా ఉండే అవకాశం కనిపిస్తోంది. బ్రూక్ తరహాలోనే అతనికి మద్దతు ఇవ్వనున్నారు. ఒకవేళ పక్కకు పెట్టాలనుకుంటే మాత్రం అభిషేక్ శర్మ ఓపెనర్ గా దిగనుండగా.. అబ్దుల్ సమద్ తుది జట్టులోకి రానున్నాడు.

బౌలింగ్ విభాగంలో మార్పులకు అవకాశం లేదు..

హైదరాబాదు జట్టు బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. పరిస్థితులకు తగ్గట్టు వాషింగ్టన్ సుందర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంటున్నారు. గడిచిన మ్యాచ్ లో సెంచరీతో బ్రూక్ ఫామ్ లోకి రాగా, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ ఫుల్ జోష్ లో ఆడుతున్నారు. మయాంక్ అగర్వాల్ కూడా టచ్ లోకి వస్తే.. సన్ రైజర్స్ జట్టు బ్యాటింగ్ కు తిరుగు ఉండదు. బౌలింగ్ విభాగంలో మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే అదరగొడుతుండగా.. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ తమ మార్కు చూపించుకోవాల్సిన అవసరం ఉంది.

SRH Vs MI
SRH Vs MI

హైదరాబాద్ జట్టు అంచనా..

ముంబై తో మ్యాచ్ కు హైదరాబాద్ జట్టు.. మాయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, మర్క్రమ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రీచ్ క్లాసెన్, మార్కో జాన్సన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్.
ఇంపాక్ట్ ప్లేయర్ : అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్

RELATED ARTICLES

Most Popular