
NTR- Saif Sli Khan: ఎన్టీఆర్ 30 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పలు కారణాలతో ఎన్టీఆర్-కొరటాల శివ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్ళలేదు. 2024 సమ్మర్ టార్గెట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న నేపథ్యంలో ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇంత భారీ చిత్రం ఏడాది కాలంలో పూర్తి చేయడం సవాలే. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి ఒత్తిడి ఉంది. 2018లో అరవింద సమేత వీరరాఘవ విడుదల చేసిన ఎన్టీఆర్ దాదాపు నాలుగేళ్ళ తర్వాత 2022 లో ఆర్ ఆర్ ఆర్ తో ప్రేక్షకులను పలకరించారు.
కొరటాల చిత్రానికి మరో రెండేళ్ల గ్యాప్ వచ్చింది. అంటే ఆరేళ్ళ వ్యవధిలో ఎన్టీఆర్ చేసింది కేవలం రెండు చిత్రాలు మాత్రమే. ఈ క్రమంలో చెప్పిన సమయానికి ఎన్టీఆర్ 30 థియేటర్స్ లోకి తేవాలని మేకర్స్ పక్కా ప్రణాళికతో వెళుతున్నారు. అందుకే వరుస షెడ్యూల్స్ ప్లాన్ చేశారని. కాగా నేడు ఎన్టీఆర్ 30 విలన్ పై అధికారిక ప్రకటన చేశారు. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
కొద్దిరోజులుగా సైఫ్ అలీ ఖాన్ కొరటాల-ఎన్టీఆర్ మూవీలో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. నేడు స్పష్టత వచ్చింది. ఎన్టీఆర్ 30 సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ జాయిన్ అయ్యారు. మేకర్స్ యూనిట్ తో ఆయన దిగిన ఫోటోలు విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ ని విలన్ గా ఎంచుకోవడం వెనుక కొరటాల పెద్ద స్కెచ్ ఇచ్చారు. నార్త్ ఆడియన్స్ లో మూవీపై హైప్ తెచ్చే ప్రయత్నం ఇది.

సైఫ్ అలీఖాన్ నటించడం ఎన్టీఆర్ 30 చిత్రానికి బాలీవుడ్ వర్గాల్లో విపరీతమైన ప్రచారం కల్పిస్తుంది. అక్కడి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి ఈ పరిణామం ఉపయోగపడుతుంది. ఆల్రెడీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ 30లో భాగం కాగా ఇండియా వైడ్ ఈ ప్రాజెక్ట్ పై చర్చ నడుస్తుంది. అలాగే ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. జూన్ లో ఆ మూవీ విడుదల కానుంది.
ఆదిపురుష్ మూవీతో సైఫ్ తెలుగుతో పాటు సౌత్ ఆడియన్స్ కి దగ్గర కానున్నాడు. ఆదిపురుష్ తర్వాత విడుదలయ్యే ఎన్టీఆర్ 30లో ఆయన నటించడం కలిసొచ్చే అంశం. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సైఫ్ అలీ ఖాన్ ని కొరటాల రంగంలోకి దించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023