IPhone: ప్రస్తుతం వ్యాపారమంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. నిత్యావసరాల నుంచి భారీ ఎలక్ట్రానిక్ పరికరాల వరకూ అన్నీ ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. దీంతో అనేక ఈకామర్స్ సంస్థలు వ్యాపారాన్ని విస్తరించేందుకు అనేక మార్గాలను అన్వేశిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేలా అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పండుగల వేళ స్పెషల్ ఆఫర్లతో సేల్స్ నిర్వహిస్తున్నాయి. అన్ని వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంతో తాజాగా ఫ్లిప్‌కార్ట్.. నిర్ణయంపై కస్టమర్లు మండిపడుతున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 పేరుతో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ దాని కోసం కస్టమర్లు ఎదురు చూసి ఆఫర్ స్టార్ అయ్యే టైంకు రెడీగా ఉన్నా.. సోల్డ్ ఔట్ అని చూపిస్తోంది. దీనిపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మకం లేని ఆఫర్లు ఎందుకని మండిపడుతున్నారు. కస్టమర్లును టెంప్ట్ చేసేందుకు ఫ్లిప్‌కార్టు ఇలా ఆఫర్లు ప్రకటిస్తోందని, కానీ ఎవరికీ ఆఫర్ ప్రకారం డెలివరీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు.
రూ.11 లకే ఐఫోన్ 13 అని..
తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024లో భాగంగా.. రూ.11 లకే ఐఫోన్ 13 ఇస్తామని ప్రకటించింది. రాత్రి 11 గంటలకు ఆఫర్ ప్రారంభమవుతుందని తెలిపింది. దీంతో లక్షల మంది ఐఫోన్ 13ను దక్కించుకునేందుకు ఎదురు చూస్తున్నారు. సెప్టెబర్ 26న సబ్‌స్క్రిప్షన్ ఉన్న ప్రైమ్ సభ్యులకు , సెప్టెంబర్ 27 నుంచి అందరికీ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. అర్ధరాత్రి వరకు వేచి ఉన్నారు. దీనికోసం ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు, ఐఫోన్ కొనాలనుకునేవారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. ఎవరూ ఊహించని.. ఎవరి ఊహకు అందరి రీతిలో ఆఫర్లు పొందవచ్చని ఫ్లిప్‌కార్టుప్రకటించింది.
ఐఫోన ఆఫర్లు ఇలా..
ఫ్లిప్‌కార్ట్.. తాజా బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో.. ఐఫోన్ 13ను కేవలం రూ.11కే ఇస్తామని పేర్కొంది. దీని అసలు ధర రూ.79,900. ఇప్పుడు ఈ సేల్‌లో మొదటి మూడు ఫోన్లు రూ.11కే అందిస్తామని సైట్‌లో పేర్కొంది. మిగతావి రూ.37,999 కొనుగోలు చేయవచ్చని తెలిపింది. సేల్ ప్రారంభం కాకపోయినా.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.49,900 లభిస్తుంది. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడళ్లపైనా భారీ డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది.
బ్యాంకుల కార్డులపై ఆఫర్..
స్మార్ట్ ఫోన్లపై నార్మల్ డిస్కౌంట్‌తోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులు
ఈ స్మార్ట్‌ఫోన్‌లపై నార్మల్ డిస్కౌంట్‌తో పాటు, ఎంపిక చేసిన బ్యాంకుల కార్డ్‌లు, ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై కూడా ఎక్స్‌ట్రా డిసౌంట్ ఉంటుందని తెలిపింది. ఎక్సే్ఛంజ్ ఆఫర్, నో–కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి.
సోల్డ్ ఔట్, ఔట్ ఆఫ్ స్టాక్..
ఇదిలా ఉంటే.. ఫ్లిప్‌కార్ట్ తీరుపై పలువురు కస్టమర్లు మండిపడుతున్నారు. ఆఫర్లు పెట్టడం వరకు బాగానే ఉంటుందని, కానీ సేల్ ప్రారంభమయ్యాక సోల్డ్ ఔట్, ఔట్ ఆఫ్ స్టాక్ అని మాత్రమే వస్తుందని అంటున్నారు. అలాంటప్పుడు ఆఫర్లు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈమేరు ఫ్లిప్‌కార్డుకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిపై ఫ్లిప్‌కార్ట్ కూడా స్పందించింది. స్పెషల్ ఆఫర్లు కేవలం ముగ్గురికి మాత్రమే వర్తిస్తుంని తెలిపింది. తర్వాత సాధారణ డిసౌంట్ అందరికీ వర్తిస్తుందని తెలిపింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Iphone 13 for rs 11 people who got excited by flipkarts offer what happened in the end
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com