Homeట్రెండింగ్ న్యూస్World Introvert Day 2025: 2025 గేమ్ చేంజర్స్ : ప్రజలను ప్రభావితం చేసిన వాళ్లు...

World Introvert Day 2025: 2025 గేమ్ చేంజర్స్ : ప్రజలను ప్రభావితం చేసిన వాళ్లు ఎవరో తెలుసా?

World Introvert Day 2025: ఇతరులతో ఎక్కువగా కలవని, బయట తమ భావాలను ఎక్కువగా వ్యక్తపరచని వారిని ఇంట్రావర్టులు అంటారు. వారు ప్రజలతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడరు. వీలైనంత వరకు ఒంటరిగా ఉంటూ తమ పని తాము చేసుకుంటారు. అవసరమైతే తప్ప ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఫంక్షన్లకు, పార్టీలకు వెళ్లే ముందు పదిసార్లు ఆలోచిస్తారు. అక్కడికి వెళ్లినా, ఎవరినీ పెద్దగా కలవరు. ఎప్పుడు అక్కడి నుండి బయటపడాలా అని ఆలోచిస్తుంటారు. చాలా మంది ఇంట్రావర్టులు తమ ప్రేమను బాహ్యంగా వ్యక్తపరచలేక బాధపడుతుంటారు. అంతేకాకుండా, తమను ప్రేమించేవారు ఎవరూ లేకపోవడం వల్ల వారు నిరాశకు గురవుతారు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా తమ ప్రవర్తనను మార్చుకోవాలి. వారు కొంచెం మారితే, తగిన భాగస్వామి ఖచ్చితంగా దొరుకుతారు. మొదట వారి బలాలు, బలహీనతలను తెలుసుకోవాలి.. క్రమంగా వారిపై నియంత్రణ సాధించాలి. ఇంట్లో కూర్చుంటే, ఎవరూ మన కోసం వెతుక్కుంటూ రారు. కాబట్టి, మనం మన పద్ధతులను పక్కనపెట్టి, కొంచెం బయటకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి.

పెళ్లిళ్లు, పార్టీలు, ఇతర ఫంక్షన్లకు వెళ్ళాలి. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ, ఓపిక పట్టాలి. ఇక అక్కడ ఉండలేనని అనిపించినప్పుడు ఇంటికి రావడం మంచిది. బయటకు వెళ్ళినప్పుడు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించి, మీకు ఎలాంటి వ్యక్తులు కావాలో తెలుసుకోవాలి. వారి స్వభావాన్ని బట్టి స‍్వభావానికి తగ్గట్టు ఇంట్రావర్ట్‌ల లేక ఎక్స్‌ట్రా వర్ట్‌ల, రెండు తత్వాలు కలిసిన వ్యక్తులా అన్నది నిర్ణయించుకోవాలి. ఏదైనా సరే బయటకు వెళ్ళలేమని మీరు భావిస్తే, ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు, సైట్‌లను ఆశ్రయించవచ్చు. అక్క ఎటువంటి సమస్య లేకుండా మీ భావాలను వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది. అవతలి వ్యక్తిని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లండి. కొంతమంది, సాధారణంగా, అందరినీ కలవలేరు. వారు తమ ప్రపంచం వేరుగా భావిస్తారు. వారు తమ సొంత ప్రపంచంలో ఉండటానికి ఇష్టపడతారు. వారు కోరుకునేది ఒంటరిగా ఉండటం, సినిమాలు/వెబ్ సిరీస్‌లు ఒంటరిగా చూడటం లేదా పుస్తకాలు చదవడం. ఇలాంటి వారిని ఇంట్రావర్టులు అంటారు.

అలాంటి ఇంట్రావర్గుల స్వరాలను విస్తరించడానికి అంకితమైన పాడ్‌కాస్ట్ “గేమ్‌ఛేంజర్స్: 2025 ఇంట్రావర్టు” జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో సోషల్ మీడియా ప్రభావం, పాడ్‌కాస్ట్‌లు, కోచింగ్, కెరీర్‌లు వ్యక్తిగత వ్యత్యాసాలపై అవగాహనను పెంచిన ఇంట్రావర్ట్ లీడర్స్ ఉన్నారు. 2025 గేమ్‌ఛేంజర్స్ తొమ్మిది యుఎస్ రాష్ట్రాలు, చెక్ రిపబ్లిక్, సోలమన్ దీవులు, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో వీరి ప్రభావం ఉంది. సెలక్షన్ ప్రాసెస్ లో న్యాయవాదం, విద్య, కంటెంట్ క్రియేషన్ పలు నైపుణ్య రంగాలకు సంబంధించిన వినూత్న ప్రయత్నాల ద్వారా చేసిన వారు అందించిన సహకారాల ద్వారా వీరిని ఎంపిక చేశారు.

వారిలో
* అబౌండింగ్ సొల్యూషన్స్: ప్రొఫెషనల్ ట్రైనింగ్, కోచింగ్;
కాటెరినా బుడినోవా, ఎంబీఏ : ఉమెన్ ఫ్రంట్ నెట్‌వర్క్ సీఈవో
డేనియల్ కోల్‌మన్, పీహెచ్ డీ : నర్సింగ్ ప్రొఫెసర్
డెలితా మోరో కోల్స్: కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్
డొమినిక్ కోల్యర్ : ఫైనాన్షియల్ ఎయిడ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
తలయా డెండీ: క్యాన్సర్ డౌలా
నిక్కీ డైవర్-క్లార్క్: కమ్యూనికేషన్స్ స్ట్రాటజిస్ట్
డేవిడ్ హాల్: రచయిత, స్పీకర్
డిమిట్రియా ఎ. హార్డింగ్ : ప్రోవోస్ట్ చీఫ్ క్యాంపస్ ఆఫీసర్
కెన్నాడి హారిస్: కంటెంట్ రైటర్
లారీ హెల్గో : మనస్తత్వవేత్త, రచయిత, విద్యావేత్త
డీడ్రా ఎంబీ స్మిత్: చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్
అనితా మూర్-బోహన్నన్ : స్టూడెంట్ అఫైర్స్, వైస్ ప్రెసిడెంట్
రెమోండ్లిన్ సాబియో : బిజినెస్ అడ్వైజర్
సామ్ షెప్పర్డ్: రచయిత, కన్సల్టెంట్
రెలాండో థాంప్కిన్స్-జోన్స్: సోషల్ జస్టిస్ ఎడ్యుకేటర్, క్రియేటర్ & హోస్ట్: సోషల్ జస్టిస్ ఆరిజిన్ స్టోరీస్
కాప్రే యేట్స్: ఇంట్రోవర్ట్ కనెక్షన్
ఇవెటా జక్లాస్నికోవా : ది క్వాంటం లీడర్‌షిప్ సీఈవో

ఇంట్రోవర్ట్స్ టు వాచ్ లిస్ట్‌లను hushloudly.com/gamechangersలో చూడవచ్చు. HushLoudly అనేది అవార్డు విన్నింగ్ పాడ్‌కాస్ట్, ఇది ఇంట్రోవర్ట్‌ల గొంతుకగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన లిస్టుల వెనుక Gamechangers: ఇంట్రోవర్ట్స్ టు వాచ్ 2023, 2024, 2025, బెస్ట్ కంపెనీలు ఫర్ ఇంట్రోవర్ట్స్ 2025, బ్లాక్ ఇంట్రోవర్ట్ వీక్, HushLoudly సీఈవో డాక్టర్ జెరి బింగ్‌హామ్ ఉన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular