Sreeja Konidela: న్యూ ఇయర్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె కామెంట్స్ కొన్ని అనుమానాలకు దారితీసింది. శ్రీజ భర్తతో విడిపోయారంటూ ప్రచారం జరుగుతుండగా… ఆమె పోస్ట్ ఆసక్తి రేపుతోంది. శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోయారని సమాచారం. వారు విడాకులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఏడాది కాలంగా శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడివిడిగా ఉంటున్నారు. శ్రీజ-కళ్యాణ్ దేవ్ లకు నవిష్క అనే పాప ఉంది. పాపకు మూడేళ్ళ వయసు ఉంటుంది. నవిష్క శ్రీజ వద్దే పెరుగుతున్నారు.

అప్పుడప్పుడు నవిష్కను కళ్యాణ్ దేవ్ కలుస్తున్నారు. బహుశా కోర్టు ఆర్డర్స్ ప్రకారమే కళ్యాణ్ దేవ్ కూతురు నవిష్కను కలిసే అవకాశం ఇచ్చి ఉండొచ్చు. శ్రీజ-కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా పోస్ట్స్ తో పాటు జరుగుతున్న పరిణామాలు వారు విడిపోయారని సుస్పష్టం. ఆ మధ్య శ్రీజను కుటుంబ సభ్యులు వరల్డ్ టూర్ కి తీసుకెళ్లారు. ఆమెను విడాకులు డిప్రెషన్ నుండి బయటపడేసేందుకు ఈ టూర్ అని తెలిసింది.
కాగా శ్రీజా తాజా పోస్ట్ విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఆమె గడచిన 2022 ఏడాదికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నన్ను అమితంగా ప్రేమించే, అభిమానించే, నా గురించి జాగ్రత్తలు తీసుకునే, నా మంచి కోరుకునే వ్యక్తిని పరిచయం చేశావు. అది ఎవరో కాదు… నేనే. నాలోని నన్ను నిద్రలేపి నాకే పరిచయం చేశావు. ధన్యవాదాలు, అని శ్రీజా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. కళ్యాణ్ దేవ్ దూరం కావడం ద్వారా తానేమిటో, తన విషయంలో ఏమి కోల్పోతున్నారో… గుర్తు చేసిందని కాలానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీజను కళ్యాణ్ దేవ్ 2016 మార్చ్ 28న వివాహం చేసుకున్నారు. చిరంజీవి అల్లుడయ్యాక కళ్యాణ్ దేవ్ నటుడు కావాలన్న కోరిక బయటపెట్టాడు. 2018లో విజేత మూవీతో కళ్యాణ్ దేవ్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. విజేత చిరంజీవి క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. ఆ టైటిల్ ని కళ్యాణ్ దేవ్ ని వాడుకున్నాడు. విజేత పర్లేదు అనిపించింది. గత ఏడాది కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలు విడుదలయ్యాయి.