YouTuber Palani Swamy: ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అని ఓ సినీ కవి అంటే.. టాలెంట్‌కు ఏజ్ అడ్డు కాదురా అంటున్నాడు ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ.. ఆండ్రాయిడ్ ఫోన్ అరచేతిలోకి వచ్చాక.. ఇంటర్నెట్ చౌకగా అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియా వేదికగా అనేక మంది తమ టాలెంట్‌తో సెలబ్రిటీగా మారిపోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో టాలెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటూ సెలబ్రిటీ కావాలన్న కల నెరవేర్చుకుంటున్నారు. కొందరు డాన్స్‌తో, కొందరు స్కిట్స్‌తో, కొందరు స్టంట్స్‌తో, కొందరు చిట్కాలు, హెల్త్ టిప్స్, వంటలతో, ఆటలతో, పాటలతో, పాతకాలపు వంటకాలతో షైన్ అవుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికగా తమ టాలెంట్ ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటున్నారు. టాలెంట్ ఉన్నవారిని నెటిజన్లు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగే సెలబ్రిటీ అయ్యాడు 60 ఏళ్ల పళని స్వామి.
నెటిజన్లకు సుపరిచితుడే..
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వాడేవారికి ఈయన సుపరిచితమే. స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పళనిస్వామి సంస్కృతి, సంప్రదాయాలు, శాస్త్రాల్లో దిట్ట. అచ్చంగా తెలుగు మాట్లాడతారు. స్వచ్ఛమైన వంటలు చేస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన పురాతన వంటలు, పాతకాలపు రుచులను పరిచయం చేస్తూ వీడియోలు పోస్టు చేస్తూ భోజన ప్రియులకు దగ్గరయ్యాడు. వంట చేసేటప్పుడు ఆయన చెప్పే విధానంతో నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. ఇక పళని స్వామికి దైవభక్తి కూడా ఎక్కువే. దేశ్లుకుఇ పూజలు చేస్తూ భక్తిని చాటుకుంటాడు.
నటన అంటే ప్రాణం..
ఆరు పదుల వయసులో ఉన్న పళని స్వామికి నటన అంటే చాలా ఇష్టం. ప్రాచీన గ్రంథాలు, కథలు, పురాణాల్లోని వేషధారణలో సోషల్ మీడియాలో కనిపిస్తాడు. నటనతో ఫాలోవర్లను మెప్పిస్తున్నాడు. అప్పుడప్పుడు భయపెడతాడు కూడా. ఇక మోడ్రన్ గెలప్‌లో ఉన్నప్పుడు ఈయనను ఎవరూ 60 ఏళ్ల వ్యక్తి అనుకోరు. స్టైలిష్ లుక్‌తో యూత్‌కే సవలా విసురుతున్నాడు. మొత్తంగా తనకు ఉన్న అనేక కళలతో 60 ఏళ్ల వయసులోనూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ సెలబ్రిటీగా మారాడు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.