
Venu Swamy: వేణు స్వామి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన సెలెబ్రిటీ జ్యోతిష్కుడు. సినిమా తారల జాతకాల ఆధారంగా వారి భవిష్యత్ చెబుతుంటారు. ఆయన చెప్పిన జాతకాలు చాలా నిజమయ్యాయి. దాంతో సాధారణ జనాలతో పాటు సెలెబ్రెటీలకు బాగా గురి కుదిరింది. స్టార్ హీరోయిన్ రష్మిక మందానకు వేణు స్వామి గురువు. ఆయన మాటలు తూచా తప్పకుండా ఫాలో అవుతుంది. ఏమాత్రం కెరీర్ డల్ అయినట్లు అనిపించినా ప్రత్యేక పూజలు చేయించుకుంటుంది. కెరీర్ బిగినింగ్ లో రష్మిక హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అనూహ్యంగా మనసు మార్చుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.
రష్మిక ఈ నిర్ణయం తీసుకోవడానికి వేణు స్వామినే కారణమట. వేణు స్వామి ఇటీవల స్వయంగా ఆ మాట చెప్పారు. రక్షిత్ శెట్టిని వివాహం చేసుకుంటే నీకు లైఫ్ లేదని చెప్పాడట. దాంతో అతనికి హ్యాండ్ ఇచ్చేసింది. అలాగే జీవితంలో రష్మిక ఇంకా హైట్స్ చూస్తుంది. ఆమె ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళుతుందని కూడా చెప్పాడు. తాజాగా నిధి అగర్వాల్ ఆయన శిష్యురాలయ్యారు. ఆమె స్టార్ హీరోయిన్ కావాలని వేణు స్వామితో పూజలు చేయించుకున్నారు.

ఇంత గొప్ప పేరున్న వేణు స్వామి తన లైఫ్ స్టైల్ గురించి ఓపెన్ అయ్యారు. తనకు మందు,మాంసం తినే అలవాటు ఉందని చెప్పారు. దేశంలో అనేక దేవాలయాల్లో భగవంతుడికి మందు, మాంసం నైవేద్యంగా పెడుతున్నారు. చాలా మంది బ్రాహ్మణులు రహస్యంగా మద్యం సేవిస్తున్నారు. మాంసాహారం తింటున్నారు. దాన్ని నేను తప్పుబట్టను. ఎందుకంటే నేను కూడా తింటాను అని వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.
నేను భోగిని. జీవితాన్ని అనుభవిస్తాను. ఎవరికీ తెలియకుండా మద్యం తాగుతాను. మాంసం కూడా తింటాను. ఇది చెప్పడానికి నేనేమీ భయపడను. ఇది తప్పు కూడా కాదు అని సమర్ధించుకున్నారు. నేను వెళ్లే ప్రాంతాన్ని బట్టి అలవాట్లు మారిపోతాయి. పరిస్థితులకు అనుకూలంగా నడుచుకుంటాను అని చెప్పారు. కాగా వేణు స్వామి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తన భార్యను లేపుకుపోయి వివాహం చేసుకున్నట్లు గతంలో చెప్పారు.