Mehran Karimi Nasseri: సుమారు 18 ఏళ్లు ఆయనకు ఎయిర్ పోర్టే ఇళ్లు అయింది. తనకు సంబంధించిన వస్తువులను విమానాశ్రయంలో ఓ మూల పెట్టుకుని అక్కడే జీవించాడు. 1988 నుంచి 2006 వరకు 18 ఏళ్ల పాటు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఎయిర్ పోర్టులోనే జీవించిన వ్యక్తి.. చివరకు ఎయిర్ పోర్టులోనే హార్ట్ ఎటాక్ తో మరణించాడు. తన అనుభవాలను డైరీలో ప్రతి రోజు రాసుకుంటూ.. పుస్తకాలు చదువుతూ ఎయిర్ పోర్టులో గడిపిన వ్యక్తి చివరికి అక్కడే కన్నుమూశారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీఫెన్ స్పీల్‌బర్గ్‌ను కదిలించిన మెహ్రాన్ కరీమీ నస్సేరి స్టోరీ సినిమాగా కూడా వచ్చింది.
18 సంవత్సరాల పాటు పారిస్ చార్లెస్ డి గల్లె ఎయిర్ పోర్టును తన నివాసంగా మార్చుకుని.. అక్కడే జీవించిన ఇరాన్ జాతీయుడు మెహ్రాన్ కరీమీ నస్సేరి తన చివరి శ్వాస కూడా ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలాడు. మెహ్రాన్ కరీమీ నస్సేరి గుండెపోటుతో చనిపోయినట్లు పారిస్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు.18 సంవత్సరాల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్న ఆయన.. చివరికి అక్కడే మరణించారు. 1988 నుంచి 2006 వరకు 18 ఏళ్ల పాటు నస్సేరి పారిస్ విమానాశ్రయంలోనే ఆశ్రయం పొందారు. అనంతరం ఆయనను వేరొక ఆశ్రమానికి తరలించారు. అక్కడ ఉంటున్న నస్సేరి ఎయిర్ పోర్టుకు వచ్చేవారు. అలా వచ్చిన క్రమంలో గుండెపోటుకు గురైన నస్సేరి.. టెర్మినల్ 2ఎఫ్‌లో తుది శ్వాస విడిచినట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు
సరైన నివాస పత్రాలు లేని కారణంగా 1988లో ఆయనను పారిస్‌లోకి వచ్చేందుకు అధికారులు అంగీకరించలేదు. దీంతో ఆయన ఎయిర్ పోర్టు టెర్మినల్‌లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత శరణార్థి పత్రాలు మంజూరైనా వాటిపై సంతకం చేసేందుకు నస్సేరి ఒప్పుకోలేదు. అప్పటి నుంచి చార్లెస్ డి గల్లే విమానాశ్రయంలోనే ఉండిపోయారు. తన వస్తువులను ఎయిర్‌పోర్ట్‌లోని ఓ మూల పెట్టుకుని అక్కడే పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. ఏ రోజుకారోజు తన అనుభవానులను డైరీలో రాసుకుంటుండేవారు. ఎక్కువ సమయాన్ని ఆర్థికశాస్త్రం పుస్తకాలను చదివేందుకు కేటాయించారు.
నస్సేరి తండ్రి ఇరానియన్, తల్లి స్కాటిష్. రాజకీయ ఉద్యమాలు చేపట్టడంతో ఆయనను ఇరాన్ ప్రభుత్వం జైళ్లో పెట్టింది. తర్వాత కొన్ని రోజులకు ఆయనకు దేశ బహిష్కరణ విధించారు. దీంతో శరణార్థిగా ఉండేందుకు ఎలాంటి పత్రాలు లేకుండా పారిస్ చేరుకుని లండన్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే అతడిని పోలీసులు పట్టుకుని వెనక్కి పంపారు. ఈయనను ప్రేరణగా తీసుకుని ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ 2004 లో టామ్ హాంక్ హీరోగా ‘ది టెర్మినల్’ సినిమాను తెరకెక్కించారు. అతని ఆత్మకథ ఆధారంగా ‘ది టెర్మినల్ మ్యాన్’ పుస్తకం ప్రచురించబడింది.