Kumaraswamy And Radhika: సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. అక్కడ అన్ని వర్గాల వారు ఉంటారు. భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. మనసులు, అభిరుచులు కలిసినవారు స్నేహితులుగా, ప్రేమికులుగా ఉంటారు. సహజీవనం చేస్తారు. కొందరు ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లారు. అయితే కొన్ని ప్రేమ పెళ్లిళ్లు మధ్యలోనే ఆగిపోతాయి. కొన్ని చివరి వరకు కొనసాగుతాయి. ఇందంతా సినిమా ఇండస్ట్రీలో కామన్. కానీ, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుని, బయటి వ్యక్తిని ప్రేమించి, అదీ రెండో పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ, కన్నడ నటి రాధిక తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి పెద్ద పోరాటమే చేసింది. ఆమె వివాహం ఇండస్ట్రీలో అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. టాప్ హీరోయిన్‌గా ఉండి.. తనకంటే 27 ఏళ్లు పెద్దవాడైన వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. కానీ, వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. ఈ పెళ్లితో ఆమె రూ.124 కోట్లకు అధిపతి అయింది. ఆమె కన్నడ నటి రాధిక. ఆ జంట కర్ణాటక మాజీ సీఎం, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి–రాధిక జంట.
రహస్య ప్రేమ..
రాధిక కన్నడలో మంచి నటి సుమారు 30 సినిమాల్లో నటించింది. అయితే నటిస్తూనే ఆమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా నాడు సీఎంగా ఉన్న హెచ్‌డీ కుమారస్వామితో రహస్యంగా ప్రేమాయణం సాగించింది. కుమారస్వామికి అప్పటికే పెళ్లై పిల్లలు ఉన్నారు. అయినా ఆమె రెండో వివాహానికి కూడా వెనుకాడలేదు. వీరి ప్రేమ వ్యవహారం అప్పట్లో సినిమా ఇండస్ట్రీతోపాటు రాజకీయాల్లోనూ తుపాను సృష్టించింది. కుటుంబం వద్దన్నా వినకుండా రాధిక పోరాడి కుమారస్వామిని 2006లో రెండో వివాహం చేసుకుంది. అందరినీ ఆశ్చర్యపర్చింది.
సినీ జీవితానికి ముగింపు..
కుమారస్వామితో ప్రేమ వ్యవహారం, కుటుంబ సభ్యులతో పోరాటం గురించి ఇండస్ట్రీలో తెలియడంతో రాధిక సినిమా కేరీర్‌పై ప్రభావం పడింది. ఆఫర్లు తగ్గిపోయాయి. క్రమంగా సినిమాలకు దూరమైంది. అయినా.. కుమారస్వామిని మాత్రం వదలలేదు. ప్రేమను గెలిపించుకోవడానికి కుటుంబ సభ్యులతో పోరాడిన తీరు ఆసక్తికరం. ఇదిలా ఉంటే.. కుమారస్వామి, రాధికకు ఇద్దరిదీ రెండో వివాహమే. కుమారస్వామికి మొదటి వివాహం 1986లో అనితతో జరిగింది. వీరికి పిల్లలు ఉఆన్నరు. రాధిక మొదటి వివాహం 2000లో జరిగింది. 2006లో కుమారస్వామి–రాధిక పెళ్లి చేసుకున్నారు.
14వ ఏటనే సినిమాల్లోకి..
ఇదిలా ఉంటే.. రాధిక తన 14వ ఏటనే నేనగాగి సినిమాతో నటన ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె 9వ తరగతి చదువుతోంది. 2002లో విడుదలైన నీల మేఘ శామ చిత్రంతో భారీ విజయం అందుకుంది. పెళ్లి తర్వాత రాధిక నిర్మాతగా మారింది. లక్కీ పేరుతో సినిమా తీసింది. ఇదిలాఉంటే పెళ్లి తర్వాత రాధిక కోటీవ్వరురాలైంది. రూ.124 కోట్లకు అధిపతి అయింది.